కృష్ణా జిల్లాలో కాల్పుల కలకలం | Krishna District Firing, Kankipadu CI Shoots Attacker During Escape Attempt, More Details Inside | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో కాల్పుల కలకలం

Sep 1 2026 10:08 AM | Updated on Sep 1 2026 10:25 AM

Krishna District Kankipadu CI Gun Fire Incident Details

సాక్షి, కృష్ణా: జిల్లాలో ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. తమపై దాడి జరిపి.. పారిపోతున్న ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దేవరపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన దుండగుడిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. 

అంతకు ముందు దుండగుడు నిన్న ఉదయం పోలీసులపై దాడి జరిపి పారిపోయాడు. అయితే అతన్ని పట్టుకునే క్రమంలో మరోసారి పోలీసుల మీదకు దాడికి దిగినట్లు తెలుస్తోంది. కత్తి, రాళ్లతో దాడి చేయగా.. ఈ క్రమంలోనే అతన్ని నిలువరించేందుకు కంకిపాడు సీఐ కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుడిని అవినాశ్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో అతని రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.

ఇదీ చదవండి: గృహ ప్రవేశం చేసిన నాలుగు రోజులకే విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement