AP: దేశంలోనే తొలిసారి.. సెకీతో ఒప్పందం ఓ ట్రెండ్‌సెట్టర్‌

Special Chief Secretary Vijayanand Says Agreement With SECI Is Trendsetter - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం దేశ వ్యవసాయ రంగంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ అన్నారు. సచివాలయంలోని ఇంధన శాఖ కార్యాలయంలో గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యుత్‌ సంస్థల అధికారులతో ఆయన తొలి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగానికి రానున్న 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలనేది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పమని తెలిపారు.
చదవండి: ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో..

అందులో భాగంగానే తక్కువ ధరకు 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను పాతికేళ్ల పాటు రాష్ట్రానికి సరఫరా చేసేలా సెకీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీలు.. పృథ్వీతేజ్, మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు.. హెచ్‌.హరనాథరావు, పద్మజనార్దనరెడ్డి, సంతోషరావు, నెడ్‌కాప్‌ ఎండీ ఎస్‌.రమణారెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top