టాప్‌50 ఎగవేతదారుల బకాయిలు రూ.87 వేల కోట్లు

Top 50 wilful defaulters owe Rs 87295 crore to banks - Sakshi

న్యూఢిల్లీ: గీతాంజలి జెమ్స్‌..ఇరా ఇన్‌ఫ్రా.. ఆర్‌ఈఐ ఆగ్రో.. ఏబీజీ షిప్‌యార్డు తదితర టాప్‌–50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు(సంస్థలు) దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సుమారు రూ.87,295 కోట్ల మేర బకాయి పడ్డారు. ఇందులో టాప్‌–10 మంది ఎగవేతదారులు రూ.40,825 కోట్ల మేర షెడ్యూల్‌ కమర్షియల్‌ బ్యాంకు(ఎస్‌సీబీ)లకు బకాయి ఉన్నారని కేంద్రం తెలిపింది.

ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి ఎస్‌సీబీలు మొత్తం రూ.10,57,326 కోట్ల మేర రుణాలను మాఫీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపిందన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి టాప్‌–50 ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు ఎస్‌సీబీలకు రూ.87,295 కోట్ల బకాయి పడినట్లు ఆర్‌బీఐ తెలిపిందన్నారు.

ఇందులో పరారైన ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ సంస్థ అత్యధికంగా రూ.8,738 కోట్లు ఎస్‌సీబీలకు బకాయి పడింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కలి్పంచే నిబంధన 2007 నుంచే ఉందని మంత్రి వివరించారు. మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన..2022–23 సంవత్సరాల్లో నమోదైన 66,069 ఆన్‌లైన్‌ మోసాల ఘటనల్లో రూ.85.25 కోట్ల మేర నష్టం జరిగిందని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top