Top 10 Telugu News: టాప్‌ 10 తెలుగు ట్రెండింగ్‌ న్యూస్‌.. ఒక్క క్లిక్‌తో

Top 10 Telugu Breaking News Latest Headlines 12th May 2022 At 10 AM - Sakshi

1. Russia-Ukraine War: రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాం
 రష్యా దళాలపై తమ సేనలు క్రమంగా పైచేయి సాధిస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఖర్కీవ్‌ నుంచి రష్యా సైనికులను వెనక్కి తరిమేస్తున్నట్లు తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఒక చట్టం... వేల వివాదాలు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్‌ లభించదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. AP: పీఆర్సీ ఐదేళ్లకే.. జీవో జారీ..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని పదేళ్లకు బదులు ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా పీఆర్సీ అమలు ఉత్తర్వుల్లో పలు సవరణలకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Asani Cyclone: ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను
ఎప్పటికప్పుడు దిశను మార్చుకుంటూ వణికించిన అసని తుపాను బలహీనపడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా ఉన్న అసని తొలుత తుపానుగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రవాణాశాఖ వింత వ్యవహారం .. కామ్‌గా కట్టించేస్తున్నారు!
 బస్సు చార్జీలు పెంచినప్పుడు ఆర్టీసీ అధికారులు బహిరంగంగానే వెల్లడించారు.. కరెంటు చార్జీలు పెరిగితే అధికారులు ముందే చెప్పారు.. కానీ వాహనాలకు సంబంధించి జీవిత కాల పన్ను, హరిత పన్నులు పెంచిన రవాణా శాఖ ఒక్కమాట కూడా బహిరంగంగా చెప్పలేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి 

6. గిట్లయితే ఎట్లా? చేతి రాతతో ప్రశ్నపత్రం.. అర్థంకాక తికమక
ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల కోదాడలో ఫస్టియర్‌ ఇంగ్లిష్‌ పేపర్‌కు బదులు కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు రాగా, తాజాగా హిందీ మీడియం విద్యార్థులకు బోర్డ్‌ చుక్కలు చూపింది. బుధవారం ఫస్టియర్‌ పొలిటికల్‌ సైన్స్‌ పరీక్ష జరిగింది.
 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. IPL 2022: వార్నర్‌ అదృష్టం.. రాజస్తాన్‌ కొంపముంచింది
ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాపిటల్స్‌ 8 వికెట్లతో రాజస్తాన్‌ రాయల్స్‌పై నెగ్గింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే వార్నర్‌ అదృష్టం రాజస్తాన్‌ రాయల్స్‌ కొంపముంచినట్లయింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ యజ్వేంద్ర చహల్‌ వేశాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Sarkaru Vaari Paata Twitter Review: ‘సర్కారు వారి పాట’ టాక్‌ ఎలా ఉందంటే..
సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా, ‘గీత గోవిందం’ఫేమ్‌ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. టాటా నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌.. సింగిల్‌ చార్జ్‌తో 437 కి.మీ రేంజ్‌
వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తాజాగా నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌ను రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం. 40.5 కిలోవాట్‌ అవర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ పొందుపరిచారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఈ రోజే బతుకుతాను.. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు
భవిష్యత్తు గురించి ఆలోచించనివారుండరు. రాబోయే రోజులు, వచ్చే ఏడాది, ఇంకో పదేళ్లపాటు.. రేపటి ఆనందకర జీవనం కోసం ఆశపడుతూనే ఉంటారు. కానీ, హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో ఉంటున్న ఐలా మమతను కలిస్తే ఈ రోజుకున్న విలువ ఏంటో తెలుస్తుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top