
చీఫ్ విప్‌గా మరొకరి నియామకం
పార్టీ నేతల మధ్య విభేదాలపై టీఎంసీ చీఫ్ మమత సీరియస్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, అసమ్మతి గళాలను ఆ పార్టీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోమవారం లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ సమరి్పంచిన రాజీనామాను ఆమె ఆమోదించారు. ఆవెంటనే, కల్యాణ్ బెనర్జీ స్థానంలో కకోలీ ఘోష్‌కు చీఫ్ విప్ బాధ్యతలు అప్పగించారు. లోక్‌సభలో పార్టీ ఉపనేతగా శతాబ్ది రాయ్‌ను నియమించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అసమ్మతిని, తిరుగుబాటు వైఖరిని సహించే ప్రసక్తేలేదని దీనిద్వారా ఆమె చెప్పకనే చెప్పినట్లయింది.
‘పార్టీ కంటే తామే మిన్న అని భావించే వారికి ఇదో హెచ్చరిక. వారికి ఇటువంటి గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది’అని టీఎంసీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిõÙక్ బెనర్జీకి లోక్‌సభలో పార్టీ నేతగా సోమవారం బాధ్యతలు అప్పగించడం తెల్సిందే.
పార్లమెంట్ సమావేశాలకు సరిగ్గా రాని ఎంపీలను వదిలేసి, తనది సమన్వయ లోపమని టీఎంసీ చీఫ్ మమత తప్పుబడుతున్నారంటూ కల్యాణ్ బెనర్జీ సోమవారం బహిరంగంగా వ్యాఖ్యానించడం తెల్సిందే. కొంతకాలంగా కల్యాaణ్ బెనర్జీ, పార్టీకే చెందిన మరో ఎంపీ మహువా మొయిత్రాలు మధ్య సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు సంభవించడం గమనార్హం.