‘బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసింది.. ఆమె గెలిచి వస్తుంది’ | TMC MP Expelled: Mamata Banerjee Slams On BJP Over Vendetta Politics Against Mahua Moitra, See Details Inside - Sakshi
Sakshi News home page

TMC MP Expelled: ‘బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసింది.. ఆమె గెలిచి వస్తుంది’

Published Fri, Dec 8 2023 4:29 PM

TMC MP Expelled: Mamata Banerjee Slams On BJP Over Vendetta Politics - Sakshi

ఢిల్లీ: పార్లమెంట్‌లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడిన విషయం తెలిసిందే.  ఆమెను లోక్‌ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఈ క్రమంలో సభలో ఉన్న ప్రతిపక్ష ఎంపీలందరూ ఆమెకు మద్దతుగా సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఇక ఈ వ్యహారంపై టీఎంసీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీవి ప్రతీకార రాజకీయాలని మండిపడ్డారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని దుయ్యబట్టారు. బీజేపీ తమ పార్టీ ఎంపీపై వ్యవహరించిన తీరు చాలా అన్యాయమని అన్నారు. మహువా మెయిత్రా మళ్లీ గెలిచి వస్తుందని తెలిపారు. ఎన్నికల్లో తనకు ప్రజలు న్యాయం చేస్తారని చెప్పారు. బీజేపీ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తుందని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement