విద్యార్థినిని గర్భవతిని చేసిన కెమిస్ట్రీ టీచర్.. | Teacher arrested for impregnating Plus-2 student | Sakshi
Sakshi News home page

మగబిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని

Dec 21 2024 11:39 AM | Updated on Dec 21 2024 11:48 AM

Teacher arrested for impregnating Plus-2 student

  పోక్సో చట్టం కింద అరెస్ట్‌

అన్నానగర్‌: కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్‌ సెల్వం (50). ఇతనికి పైళ్లె పిల్లలు కూడా ఉన్నారు. అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ పాఠశాలలో చదువుతున్న ప్లస్‌–2 విద్యార్థినిని లైంగికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఈ విద్యార్థి ప్రస్తుతం చైన్నెలోని ఓ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. 

ఈ స్థితిలో 15వ తేదీన కడుపునొప్పి రావడంతో విద్యార్థిని చికిత్స నిమిత్తం చైన్నెలోని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అప్పుడు ఆమెకి అబ్బాయి పుట్టాడు. దీంతో విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది చూసిన ఆసుపత్రి సిబ్బంది విద్యార్థిని రక్షించి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

అనంతరం విద్యార్థిని బంధువులు సెంఽబియం తోప్పు ఆల్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడు మలర్‌ సెల్వంను గురువారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తానని బెదిరించి గతేడాది స్కూల్‌లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement