వీడియో తీయడంతో అడ్డంగా బుక్కైన వసూల్‌ రాజాలు

Tamil Nadu: Two Police Officers In Salem Suspended For Taking Bribe - Sakshi

సాక్షి, చెన్నై : వాహనాల నుంచి డబ్బు వసూలు చేస్తున్న పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. సేలం జిల్లా ఓమలూరు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సెల్వమణి, ప్రత్యేక ఎస్‌ఐ సెల్వమణి ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి విమానాశ్రయం కార్గో నుంచి వచ్చే వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. శుక్రవారం యూనిఫాం కూడా ధరించకుండా ప్రైవేటు వాహనంలో వచ్చి వాహనాల తనిఖీ చేపట్టారు. కార్గో నుంచి బయటకు వచ్చిన ఓ లారీని ఆపేశారు. అన్ని పేపర్లు ఉన్నాయని, చూడాలని డ్రైవర్‌ చెప్పినా ఇన్‌స్పెక్టర్‌ వినలేదు. డబ్బు ఇచ్చి కదలాలని ఆదేశించారు. ఈ దృశ్యాన్ని క్లీనర్‌ తన సెల్‌ ద్వారా వీడియో తీసి ట్రాన్స్‌పోర్టు సంస్థకు పంపించాడు. అక్కడి సిబ్బంది ఆ ఇన్‌స్పెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు శనివారం వీడియో, ఆడియోను పంపించారు. వారిని డీఐజీ మహేశ్వరి సస్పెండ్‌ చేశారు. 

చదవండి: యూట్యూబర్‌ మదన్‌కు రిమాండ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top