
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ లాయర్ దాడికి ప్రయత్నించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నించిన లాయర్‌పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. రాకేష్ కిషోర్‌ను విధుల నుంచి బహిష్కరించింది.
న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన లాయర్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోమవవారం (అక్టోబర్6న) సుప్రీంకోర్టులో ఓ కేసుకు సంబంధించిన వాదనలు జరిగే సమయంలో లాయర్ రాకేష్ కిషోర్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ‘షూ’ విసిరేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తోటి లాయర్లు అప్రమత్తం కావడంతో కోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బార్ కౌన్సిల్.. న్యాయవాదిగా ప్రవర్తించాల్సిన నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినందుకు రాకేష్ కిషోర్‌ను తక్షణమే సస్పెండ్ చేసింది.‘ఇది న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే చర్య. ఇటువంటి ప్రవర్తనను ఏ మాత్రం సహించం’ అని బార్ కౌన్సిల్ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. అవసరమైతే శాశ్వతంగా లాయర్‌గా ప్రాక్టీస్ చేసే హక్కును రద్దు చేయొచ్చని బార్ కౌన్సిల్ సూచించింది. మరోవైపు, ఢిల్లీ పోలీస్ శాఖ కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.