వీవీప్యాట్‌ స్లిప్పుల క్రాస్‌చెక్‌.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | Supreme Court Key Comments On Total Vvpat Verification Case | Sakshi
Sakshi News home page

వీవీప్యాట్‌ స్లిప్పుల తనిఖీ.. తీర్పు రిజర్వు చేసిన సుప్రీంకోర్టు

Apr 25 2024 3:58 PM | Updated on Apr 25 2024 3:58 PM

Supreme Court Key Comments On Total Vvpat Verification Case - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌(ఈవీఎం)లలో వేసిన మొత్తం ఓట్ల వీవీప్యాట్‌ స్పిప్పులు వెరిఫై చేయాలని వేసిన పిటిషన్‌లపై బుధవారం(ఏప్రిల్‌24) మరోసారి విచారణ జరిపిన అత్యున్నత కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగసంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ ఏ పనిచేయాలన్నది తాము సూచించలేమంది. ఎన్నికల్లో మొత్తం వీవీప్యాట్‌ స్లిప్పుల వెరిఫికేషన్‌పై సుప్రీంకోర్టు బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో తమకు ఉన్న పలు సందేహాలపై న్యాయమూర్తులు ఈసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం తీర్పు రిజర్వు చేశారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement