రిటైరయ్యేలోపు తీర్పివ్వండి | Supreme Court To Consider Setting Up Constitution Bench For Pleas Against Validity Of Passage Of Laws | Sakshi
Sakshi News home page

రిటైరయ్యేలోపు తీర్పివ్వండి

Jul 16 2024 4:44 AM | Updated on Jul 16 2024 8:57 AM

Supreme Court To Consider Setting Up Constitution Bench For Pleas Against Validity Of Passage Of Laws

చట్టాలను ద్రవ్య బిల్లుల మాటున లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు 

ఇలాంటి విధానం చట్టబద్ధతను త్వరగా తేల్చండి 

సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ వినతి 

న్యూఢిల్లీ: ఆధార్‌ వంటి సాధారణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా ఎన్‌డీఏ సర్కార్‌ లోక్‌సభలో ప్రవేశపెడుతున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ విధానం చట్టబద్ధతను తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పారి్ధవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం సంబంధిత పిటిషన్‌ను సోమవారం విచారించింది. 

కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. ‘‘ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశాక ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్‌ చెప్పారు. దీనిపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 110 కింద ఎన్నో సాధారణ బిల్లులను ద్రవ్యబిల్లులుగా పేర్కొంటూ మోదీ సర్కార్‌ లోక్‌సభలో ఆమోదింపజేసుకుంటోంది. 

ఈ రాజ్యాంగ అతిక్రమణకు 2016నాటి ఆధార్‌ చట్టం చక్కని ఉదాహరణ. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తే కోర్టు కూడా ‘ఇది రాజ్యాంగపరంగా మోసమే’ అంటూ సమరి్థంచింది. 2014 నుంచి ఆర్టికల్‌110 దుర్వినియోగంపై విచారణకు రాజ్యాంగ బెంచ్‌ ఏర్పాటుచేస్తానని సీజేఐ తీర్పుచెప్పడం హర్షణీయం. ఈ ఏడాది నవంబర్‌లో సీజేఐ చంద్రచూడ్‌ రిటైర్‌ అయ్యేలోపు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్ట్‌ చేశారు. 

ఆధార్‌ చట్టం, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(సవరణ) వంటి కీలక బిల్లులను ద్రవ్యబిల్లుగా మోదీ సర్కార్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పెద్దలసభలో మెజారిటీ లేని కారణంగా అక్కడ బిల్లులు వీగిపోకుండా, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని చాన్నాళ్లుగా విపక్షాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement