‘సన్నీ లియోన్‌’ .. కాలేజీ టాపర్‌ | Sunny Leone Makes Top Of Merit List For Admission in Kolkata College | Sakshi
Sakshi News home page

కోల్‌కతా కాలేజీలో అనూహ్య సంఘటన

Aug 28 2020 9:13 AM | Updated on Aug 28 2020 10:51 AM

Sunny Leone Makes Top Of Merit List For Admission in Kolkata College - Sakshi

కోల్‌కతా: అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం నగరంలోని అషుతోష్‌ కాలేజీ ప్రకటించిన మెరిట్‌ జాబితాలో బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ అగ్రస్థానంలో నిలిచారు. కాలేజీ వెబ్‌సైట్‌లో బీఏ(ఆనర్స్‌) ప్రవేశానికి ఉద్దేశించిన జాబితాలో సన్నీ పేరు టాప్‌లో రావడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. నటి ఈ కాలేజీలో చదువుతుందా ఏంటి అని ఆశ్చర్యపోయారు. సన్నీ పేరుతో పాటు అప్లికేషన్ ఐడి, రోల్ నంబర్ కూడా ఉండటం గమనార్హం. అంతేకాక 12వ తరగతి బోర్డు పరీక్షల్లో బెస్ట్‌ ఫోర్‌ సబ్టెక్టుల్లో పూర్తి మార్కులు అంటే 400 మార్కులు సాధించడం విశేషం. ఇది కాస్తా గందరగోళానికి దారి తీయడంతో కాలేజీ యాజమాన్యం దీనిపై స్పందించింది. ఇది ఎవరో ఆకతాయి చేసిన పని అని తెలిపింది. కావాలనే ఎవరో తప్పుడు దరఖాస్తును సమర్పించారని వెల్లడించింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. (చదవండి: బాధ పడుతున్నా.. కానీ తప్పదు: నటి)

అయితే సన్నీ పేరు ఇలా వార్తల్లో నిలవడం ఇదే ప్రథమం కాదు. 2019 ఎన్నికల సమయంలో ఓ టీవీ రిపోర్ట్‌ సన్ని డియోల్‌ బదులు సన్నీ లియోన్‌ ముందంజలో ఉందంటూ తప్పుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement