మాస్క్‌ల శిక్షకు మొదటి రోజు: సన్నీలియోన్‌

Sunny Leone Shares Family Mask Photo Over Corona Amid - Sakshi

కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభణ నేపథ్యంలో ఎక్కడ చూసినా ప్రజలు మాస్క్‌లతో దర్శనమిస్తున్నారు. ఇక ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌, ఆమె భర్త డేనియల్ వెబర్, వారి ముగ్గురు పిల్లలు మాస్క్‌లు ధరించిన ఫొటోను తాజాగా సన్నీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కరోనా కారణంగా కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన ఆమె.. ఫ్యామిలీతో మంగళవారం బయటకు వచ్చారు.
భారత్‌ గట్టేక్కాలంటే ఈ ఐదూ పాటించాల్సిందే!

ఈ క్రమంలో వారంతా మాస్క్‌లు ధరించాల్సి వచ్చిందంటూ.. ‘ఇదీ కొత్త శకం! నా పిల్లలు ఇలా మాస్క్‌లు ధరించి ఇబ్బంది పడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ ఇది ఇప్పుడు చాలా అవసరం. ఈ పసివారి మాస్క్‌ల శిక్షకు ఇది మొదటి రోజు’ అంటూ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ తల్లిగా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సన్నీకి నిషా అనే నాలుగేళ్ల కూతురు.. నోహా, అశేర్‌ అనే కవల పిల్లలు ఉన్నారు. నిషాను మహారాష్ట్ర లాతురులో దత్తత తీసుకోగా.. సరోగసి ద్వారా ఇద్దరూ మగ కవలలకు తల్లయ్యారు సన్నీ. (ఉమెన్స్‌ డే.. సన్నీ బంపర్‌ ఆఫర్‌

కాగా... కరోనా వైరస్‌ కారణం‍గా సినిమా షూటింగ్‌లు వాయిదా పడటంతో నటీనటులు ఇంటికి పరిమితమయ్యారు. ఇక ఇంట్లో కుటుంబంతో గడుపుతున్న ఫొటోలను, వారి రోజువారి కార్యకలపాలను సెలబ్రిటీలు తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ కత్రినాకైఫ్‌ వ్యాయామం చేస్తున్న ఫొటోలను, వీడియోలను వరుసగా షేర్‌ చేస్తుండగా... ఇక హీరో అర్జున్‌ కపూర్‌ కూడా ఇంట్లో సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నానంటూ ఫొటోలను షేర్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top