కరోనా: భారత్‌ గట్టెక్కాలంటే వీటిని పాటించాల్సిందే!

Covid 19 India To Take 5 Steps To Handle The Deadly Virus - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వ్యాప్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోంది. కోవిడ్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ దిశగా అడుగులు సమర్థవంతంగా వేయడంలేదని తెలుస్తోంది. ఇక వైరస్‌ బారినపడినవారికి చికిత్స అందించడం ఎంత ముఖ్యమో.. అనుమానితులను గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం అంతకంటే ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. లేదంటే వైరస్‌ వ్యాప్తి మనుషుల మధ్య తీవ్రమై కోలుకోలేని నష్టాన్ని మిగుల్చుతుందని డబ్ల్యూహెచ్‌వో  డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్ హెచ్చరించారు.

ఇక చైనా తర్వాత కోవిడ్‌ కోరల్లో చిక్కిన దక్షిణ కొరియా.. సమగ్రమైన వైరస్‌ నిర్ధారణ పరీక్షలతోనే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగిందనేది తెలిసిందే. అక్కడే డ్రైవ్‌-ఇన్‌ టెస్టులు కూడా నిర్వహించారంటే వారి అప్రమత్తత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై పోరుకు మనదేశం వెంటనే చేపట్టాల్సిన ఐదు చర్యలివేనని కొందరు వైద్యశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
(చదవండి: కరోనాను కట్టడికి డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచనలు)

1. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రస్తుతం ప్రైవేటు ల్యాబ్‌లపై నిషేదం ఉంది. దానిని ఎత్తివేయాలి. ప్రైవేటు రంగానికి అనుమతినివ్వాలి.
2. కొన్ని రకాల వ్యాధి నిర్ధారణ కిట్లను భారత్‌ బ్యాన్‌ చేసింది. వాటిని పునరుద్ధరించాలి. భారత్‌ బ్యాన్‌ చేసిన కిట్లతో విదేశాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. అమెరికా, యూరప్‌లలో వాటిని వాడుతున్నారు.
3. కరోనా పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలు బారులు తీరుతున్నారు. గంటల తరబడి వరసల్లో నిలుచుంటున్నారు. ఇది వైరస్‌ వ్యాప్తికి కారణమవుతుది. ప్రజల ఇళ్ల నుంచే నమూనాలు సేకరించి.. పరీక్షలు జరపాలి. వాటిని సేకరించేందుకు సహాయకులను కేంద్రం నియమించాలి. ప్రైవేటు భాగాస్వామ్యంతోనే ఇది సాధ్యం.
4. కరోనా పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయాలి. దీనికోసం ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేయాలి.
5. వైరస్‌బారిన పడిన బాధితులు ప్రైవేటులో చికిత్స చేయించుకునేందుకు అనుమతించాలి. కరోనా చికిత్స కోసం ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసుకునేలా ప్రైవేటు ఆస్పత్రులకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయాలి.
చదవండి ►
కరోనా అలర్ట్‌ : మహేష్‌బాబు సూచనలు
కరోనా: ట్రీట్‌మెంట్‌ తర్వాత డాక్టర్లు ఏం చేస్తారో తెలుసా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top