సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్‌ అంటూ.. | Sakshi
Sakshi News home page

సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్‌ అంటూ..

Published Tue, Nov 3 2020 5:07 PM

Stone Pelting on CM Nitish Kumar in Bihar Election Campaign  - Sakshi

పాట్నా: బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. మధుబన్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం నితీష్‌కుమార్‌పై ఉల్లిగడ్డలు, రాళ్లు విసిరి యువకులు నిరసన వ్యక్తం చేశారు. నితీశ్‌ కుమార్‌ ఫెయిల్యూర్‌ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇప్పటి వరకు నితీశ్‌ కుమార్‌ బిహార్‌కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉద్యోగాల విషయం గురించి మాట్లాడగానే ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో స్టేజ్‌ మీద ఉన్నప్పుడే నితీశ్‌కు కోపం వచ్చింది. ఇంకా విసరండి అంటూ పదే పదే అన్నారు.

ఇంతలో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రాళ్లు తగలకుండా అడ్డుగా నిలిచారు. రాళ్లదాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని ఏం చేయొద్దని క్షమించి వదిలేయాలని నితీశ్‌ అన్నారు. ఇక నితీశ్‌పై దాడి చేయడం ఇదేమీ తొలిసారి కాదు 2018లో నందన్‌ అనే గ్రామంలో దళితులు, మహిళలపై దాడుల నేపథ్యంలో నితీశ్‌ కాన్వాయ్‌ పై దాడి జరిగింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో జరిగిన ఈ దాడి ఎన్నికల ఫలితాలపై ఏవిధంగా ప్రభావం చూపనుందో తెలియాల్సి ఉంది. బిహార్‌ ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 10వ తేదీన విడుదల కానున్నాయి. 

చదవండి: నితీష్‌కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్‌

Advertisement
Advertisement