లైవ్‌ అప్‌డేట్స్‌: ‍బిహార్‌లో ముగిసిన‌ పోలింగ్‌

Live Updates On Bihar Assembly Election Polling - Sakshi

నేడు బిహార్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు

10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉపఎన్నికలు

పట్నా : బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్‌ జరిగింది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలే పోలింగ్‌ ముగిసింది. సున్నితమైన ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా బలగాలను మోహరించారు. నేటి పోలింగ్‌లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  వృద్ధులు, కోవిడ్‌ లక్షణాలున్నవారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్య చర్యలను పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌ జరుగుతోంది.

లైవ్‌ అప్‌డేట్స్‌ 

  • గుజరాత్‌లో 8 స్థానాలకు కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్‌
  •  ఉ‍దయం 10గంటల వరకు 11.52 శాతం పోలింగ్‌ నమోదు
  • ఎల్‌జేపీ చీఫ్ చిగార్‌ పాశ్వాన్‌‌ తన ఓటు హక్కును వినిమోగించుకున్నారు
  • నితీష్‌కు ఇదే చివరి ఎన్నిక, మరోసారి ఆయన సీఎం కాలేరు : చిరాగ్‌
  • పాట్నా రాజేంద్రనగర్‌లో ఓటేసిన డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ
  • పాట్నాలో ఓటుహక్కు వినియోగించుకున్న తేజస్వీ యాదవ్, రబ్రీదేవి
  • మధ్యప్రదేశ్‌లో ఉదయం 9 గంటల వరకు 10.81 శాతం పోలింగ్ నమోదు
  • ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ దిఘాలో ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
  • రాజధాని పట్నాలో  ఉదయం 9.30 గంటల వరకు 10 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.
  • రోసిరా పరిధిలోని 133,134 పోలింగ్‌ స్టేషన్‌లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు.
  • ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా నేతలు పట్టించుకోవడంలేదని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.


బిహార్‌తో పాటు 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్‌ మొదలైంది. మధ్యప్రదేశ్‌ -28 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్‌ -8, ఉత్తరప్రదేశ్‌ -7 స్థానాలకు ఉపఎన్నికలకు పోలింగ్‌ జరుగుతోంది. ఒడిశా, నాగాలాండ్‌, కర్ణాటక, జార్ఖండ్‌లో రెండేసి స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ (దుబ్బాక), హర్యానాలో ఒక్కో స్థానానికి ఉపఎన్నికల పోలింగ్‌ మొదలైంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top