ABC: ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ ఛైర్మన్‌గా శ్రీనివాసన్‌ స్వామి | Srinivasan K Swamy elected as Chairman of Audit Bureau of Circulation | Sakshi
Sakshi News home page

ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ ఛైర్మన్‌గా శ్రీనివాసన్‌ స్వామి

Sep 15 2023 4:31 PM | Updated on Sep 15 2023 8:29 PM

Srinivasan K Swamy elected as Chairman of Audit Bureau of Circulation - Sakshi

న్యూస్‌ పేపర్ల సర్క్యులేషన్‌ను ప్రకటించే ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌, ABCకి కొత్త కార్యవర్గం ఎన్నికయింది. 2023-24 ఏడాదికి గాను ABC ఛైర్మన్‌గా శ్రీనివాసన్‌ K.స్వామి ఎన్నికయ్యారు. శ్రీనివాసన్‌ ఎన్నికకు సంబంధించి ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ ఒక అధికారిక ప్రకటన చేసింది. 

శ్రీనివాసన్‌ ప్రస్తుతం RK స్వామి హన్స గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనివాసన్‌.. వివిధ హోదాల్లో ఎన్నో సేవలందించారు. గతంలో ఏషియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అడ్వర్టైజింగ్‌ అసొసియేషన్‌కు ఛైర్మన్‌గా, అలాగే ఇంటర్నేషనల్‌ అడ్వర్టైజింగ్‌ అసొసియేషన్‌ ఛైర్మన్‌గా పని చేశారు. మద్రాస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ అసొసియేషన్‌లోనూ ఆయన సేవలందించారు. అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసొసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తరపున లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డును గతంలో అందుకున్నారు శ్రీనివాసన్‌.
చదవండి: మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ

2023-24కు గాను ఎన్నికయిన కార్యవర్గం వివరాలు
► డిప్యూటీ ఛైర్మన్‌ - రియాద్‌ మాథ్యూ (చీఫ్‌ అసొసియేట్‌ ఎడిటర్‌, మలయాళ మనోరమా)
►గౌరవ కార్యదర్శి - మోహిత్‌ జైన్‌ (ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, బెన్నెట్‌ కోలెమన్‌)
►ట్రెజరర్‌ - విక్రమ్‌ సకుజా(గ్రూప్‌ సీఈవో, మాడిసన్‌ కమ్యూనికేషన్స్‌)

ABCలో అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీ ప్రతినిధులు
►శ్రీనివాసన్‌ స్వామి, ఛైర్మన్‌
►విక్రమ్‌ సకుజా, ట్రెజరర్‌
►ప్రశాంత్‌ కుమార్‌, సభ్యులు
►వైశాలి వర్మ, సభ్యులు

పబ్లిషర్స్‌ ప్రతినిధులుగా 
►రియాద్‌ మాథ్యూ, డిప్యూటీ ఛైర్మన్‌
►ప్రతాప్‌ జి.పవార్‌, సకల్‌ పేపర్స్‌
►శైలేష్‌ గుప్తా, జాగరన్‌ ప్రకాషణ్‌
►ప్రవీణ్‌ సోమేశ్వర్‌, HT మీడియా
►మోహిత్‌ జైన్‌, బెన్నెట్‌ కోలెమన్‌
►ధృబ ముఖర్జీ, ABP
►కరణ్‌ దర్దా, లోక్‌మత్‌ 
►గిరీష్ అగర్వాల్‌, DB ఎన్నికయ్యారు

కరుణేష్‌ బజాజ్‌, ITC, అనిరుద్ధ హల్దార్‌, శశాంక్‌ శ్రీవాస్తవ, మారుతీ సుజుకి కార్పోరేట్‌ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement