మిత్రం దేశం ఇలా చేస్తుందా.? అమెరికాపై థరూర్‌ ఆగ్రహం | shashi tharoor says friend us offered no condolences for indian sailors | Sakshi
Sakshi News home page

మిత్రం దేశం ఇలా చేస్తుందా.? అమెరికాపై థరూర్‌ ఆగ్రహం

Jun 14 2026 7:34 AM | Updated on Jun 14 2026 10:52 AM

shashi tharoor says friend us offered no condolences for indian sailors

సాక్షి, ఢిల్లీ: ఇటీవల ఒమన్‌ తీరంలో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మృతిచెందిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ ఘటనపై  కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ఒమన్ దాడిలో భారతీయ నావికుల మృతిపై 'మిత్రదేశం' అమెరికా సంతాపం తెలపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో భారతీయ సిబ్బంది మరణించిన ఘటనపై అమెరికా స్పందించిన తీరు సరైంది కాదని విమర్శించారు.

శశిథరూర్‌ మాట్లాడుతూ.."ఈ అధికారిక అమెరికా ప్రకటనను చదవడం చాలా షాకింగ్‌గా ఉంది. అమాయక భారతీయ ప్రాణాలు కోల్పోవడంపై ఇందులో ఎలాంటి విచారం లేదా సంతాపం లేదు. ఒక 'మిత్రదేశం', వ్యూహాత్మక భాగస్వామి ఇంత ఘోరమైన ఉదాసీనతను ఎలా ప్రదర్శిస్తుంది?" అని ఎక్స్ వేదికగా వాషింగ్టన్‌ని ప్రశ్నించారు.

ఒకవేళ ఆ నౌక నిబంధనలను పాటించకుండా ఉన్నా.. ఆ వాణిజ్య నౌకపై దాడులు కాకుండా ఇతర మార్గాల ద్వారా ఎందుకు ఆపలేకపోయారని అడిగారు. సాధారణ సిబ్బంది ప్రాణాలను బలిగొనేలా క్షిపణులను ప్రయోగించకుండా, ఒక నౌక యొక్క ప్రొపల్షన్ (నడిచే వ్యవస్థ) లేదా స్టీరింగ్‌ను మాత్రమే నిలిపివేయడం సాధ్యం కాదా?" అని ఆయన ప్రశ్నించారు.

ట్రంప్‌ వివరణ 

కాగా ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే వివరణ ఇచ్చారు. ఈ దాడులు జరిపింది. ఇరాన్‌ అని వాటిని ఎట్టిపరిస్థితుల్లో ఊపేక్షించేది లేదన్నారు.

మార్కో రూబియోతో జైశంకర్ ఫోన్
ఒమన్ గల్ఫ్‌లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన అంశాన్ని భారత విదేశాంగ మంత్రి  జైశంకర్ శనివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

కాగా కేవలం మూడు రోజుల వ్యవధిలో అమెరికా మూడు సార్లు భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న నౌకలపై దాడి చేసింది. ఇందులో రెండు సార్లు భారతీయ నావికులను రక్షించగా ఒకసారి దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై న్యూఢిల్లీ ఇప్పటికే వాషింగ్టన్‌కు తన తీవ్ర అభ్యంతరాలను, ఆందోళనను తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement