ముగిసిన కేం‍ద్ర కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు | Several Key Decisions Taken In Central Cabinet Meeting | Sakshi
Sakshi News home page

ముగిసిన కేం‍ద్ర కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

Jun 9 2021 1:42 PM | Updated on Jun 9 2021 3:42 PM

Several Key Decisions Taken In Central Cabinet Meeting - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. అలాగే  ఉచిత వ్యాక్సిన్, ఆర్ధిక వ్యవస్థపై కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఇక పట్టణాల్లో 3.61 లక్షల గృహాల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొంది. 

2021 సంవత్సరానికిగాను 100 రోజుల ఛాలెంజ్‌ పేరుతో రాష్ట్రాలకు పీఎంఏవై-యూ అవార్డులు కేంద్రం ప్రధానం చేయనుంది. ఇక ఇప్పటివరకు మంజూరు చేసిన 1.12 కోట్ల గృహాలలో 82.5 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నట్టు వెల్లడించింది. కాగా కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా కోవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్రం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

(చదవండి: BJP MP: మీ ఎమ్మెల్యేలు, మీరు ఈ మాఫియాలో భాగమే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement