ఇళ్లల్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు పౌరులు మృతి | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి

Published Sun, Jan 1 2023 8:57 PM

Several Civilians Dead In Suspected Terror Attack In Jammu Kashmir - Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రి గ్రామంలో మైనారిటీ వర్గం లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధాలతో గ్రామంలోకి చొరబడిన దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో 10 మంది స్థానికులు గాయపడ్డారు. తూటాలు తగిలిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రమూకల కోసం భద్రతా దాళం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు దుండగులు గ్రామంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. 

‘మూడు ఇళ్లల్లో కాల్పులు జరిగాయి. ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుల కోసం గాల్పింపు చర్యలు కొనసాగుతున్నాయి. ’అని తెలిపారు అదనపు డీజీపీ ముకేశ్‌ సింగ్‌. మరోవైపు.. కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని, మరో ఎనిమిది మంది గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాజౌరీ వైద్య కళాశాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన రెండు వారాళ్లో పౌరులే లక్ష్యంగా కాల్పులు జరగటం ఇదే రెండో సంఘటన. డిసెంబర్‌ 16న ఆర్మీ క్యాంప్‌ సమీపంలో ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. 

ఇదీ చదవండి: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement