ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు | SBI Specialist Officer Recruitment 2021: Vacancies, Eligibility, Selection Process | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

Aug 17 2021 1:51 PM | Updated on Aug 17 2021 1:53 PM

SBI Specialist Officer Recruitment 2021: Vacancies, Eligibility, Selection Process - Sakshi

సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌.. స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ దరఖాస్తులు కోరుతోంది.

ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌.. స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 68

► పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌–ఇంజనీర్‌(సివిల్‌)–36, అసిస్టెంట్‌ మేనేజర్‌–ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–10,అసిస్టెంట్‌ మేనేజర్‌–మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌–04, డిప్యూటీ మేనేజర్‌(అగ్రికల్చర్‌ స్పెషల్‌)–10, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌(ఓఎంపీ)–06, ప్రొడక్ట్‌ మేనేజర్‌(ఓఎంపీ)–02.

► అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్‌)/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► వయసు: 01.04.2021 నాటికి 21ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది:13.08.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:02.09.2021

► పరీక్ష తేది: 25.09.2021

► వెబ్‌సైట్‌: https://sbi.co.in

Advertisement
 
Advertisement
Advertisement