హెల్మెట్‌ లేకుండా రైడ్‌ చేస్తే లైసెన్స్‌ రద్దు!

Riding Without Helmets Suspension Of License For Three Months - Sakshi

న్యూఢిల్లీ: ట్రాఫిక్‌ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్‌ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో హెల్మెట్‌ లేకుండా రైడింగ్‌ చేస్తే మూడు నెలలపాటు లైసెన్స్‌ రద్దు చేస్తాం అని పోలీసులు చెప్పారు. అంతేకాదు యూట్యూబ్‌లో ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన వీడియోని ముంబై పోలీసులు పోస్ట్‌ చేశారు కూడా. ఆ వీడియోలో ...."హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరం. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రతి వ్యక్తి చలాన్‌ని వెంటనే ఆర్టీవోకి పంపతాం.

దీంతో మూడు నెలల పాటు లైసెన్స్‌ రద్దు చేయడమే కాకుండా జరిమాన కూడా విధించబడుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి సమీపంలోని ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ పంపిస్తాం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తాం." అని డీసీపీ రాజ్‌ తిలక్‌ రోషన్‌ పేర్కొన్నారు. అలాగే ఎరుపు రంగు సిగ్నల్‌ పడినప్పుడూ హారన్‌లు మోగించకుండా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు.

దీంతో ఎవరైన గనుక ఇలా హారన్‌ మోగిస్తే ఆయా వాహనాల వ్యక్తుల డబుల్‌ టైం వెయిటింగ్‌ చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అదీగాక ముంబై ప్రపంచంలోనే అత్యంత ధ్వనించే నగరాల్లో ఒకటి. పైగా ముంబై వాసులు రెడ్‌ సిగ్నల్‌ వద్ద కూడా హారన్‌లు వేయడంతో శబ్దకాలుష్యం ఎక్కువ అతుతోందని, దీన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ పోలీస్ కమీషనర్ మధుకర్ పాండే అన్నారు.

(చదవండి: రిక్షాలో మినీ గార్డెన్‌...ఫోటోలు వైరల్)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top