రిపబ్లిక్‌ డే వేడుకలు: ఆకట్టుకున్న 1900 చీరల ప్రదర్శన | Republic Day Parade 1900 Sarees From Different States On Display In Delhi, Details Inside - Sakshi
Sakshi News home page

Republic Day Celebrations: ఆకట్టుకున్న 1900 చీరల ప్రదర్శన

Published Fri, Jan 26 2024 4:30 PM

Republic Day Parade 1900 Sarees From Different States On Display - Sakshi

న్యూఢిల్లీ: కర్తవ్యపథ్‌లో శుక్రవారం 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలల్లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన పరేడ్‌లో వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన సీటింగ్‌ ఏరియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వీక్షకులను ఆకట్టుకుంది. సీటింగ్‌ ఏరియాలో సుమారు 1900 చీరలను ప్రదర్శించారు. ‘అనంత్‌ సూత్ర’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన చీరలను ప్రదర్శనకు పెట్టారు.

చెక్క ఫ్రేమ్స్‌కు రంగరంగు చీరలను అమర్చి ప్రదర్శించారు. దీంతో సీటింగ్‌ ఏరియాలో కూర్చన్న వీక్షకులను వాటిని చూసి సందడి చేశారు. ఇక.. ఆ చిరలను ఎక్కడ నేశారో? వాటి వెరైటీ ఎంటో? చీరల ఎంబ్రైడరీకి సంబంధించిన పలు విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రతి చీరకు యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేయటం విశేసం. దీనికి సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్‌ తన ‘ఎక్స్‌’(ట్విటర్‌) ఖాతాలలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకేసారి  దేశంలో ఉ‍న్న పలు వెరైటీ చీరలు చూడటం బాగుంది.. యూఆర్‌ కోడ్‌ ఐడియా సూపర్‌’ అని కామెంట్లు చేస్తున్నారు.       

Advertisement
Advertisement