NIA చీఫ్‌గా రాకేష్ అగర్వాల్ | Rakesh Aggarwal Appointed as NIA Chief | Sakshi
Sakshi News home page

NIA చీఫ్‌గా రాకేష్ అగర్వాల్

Jan 15 2026 2:49 AM | Updated on Jan 15 2026 2:52 AM

Rakesh Aggarwal Appointed as NIA Chief

న్యూ ఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా అధికారి రాకేష్ అగర్వాల్‌ నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ కేడర్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ అగర్వాల్‌ 2028 ఆగస్టు 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం ఎన్‌ఐఏ అదనపు డైరెక్టర్ జనరల్ (SDG)గా పనిచేస్తున్న రాకేష్ అగర్వాల్.. డైరెక్టర్ జనరల్ (SDG)గా  పూర్తి బాధ్యతలు చేపడతారు. గత సంవత్సరం డిసెంబరులో ఆయన తాత్కాలిక చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. రాకేష్ అగర్వాల్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌(SDG)గా 2025 సెప్టెంబర్ నుంచి పని చేస్తున్నారు.

మరోవైపు ఐటీబీపీ డైరెక్టర్ జనరల్‌గా శత్రుజిత్ సింగ్ కపూర్‌ నియమితులయ్యారు. ఇక ఐటీబీపీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ప్రవీణ్ కుమార్‌ను బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement