కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో రాహుల్‌ గాంధీ ఉన్నారా? | Rahul Gandhi Reacts On Congress Party Chief Post | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో రాహుల్‌ గాంధీ? ఆయన ఏమన్నారంటే..

Sep 9 2022 2:32 PM | Updated on Sep 9 2022 2:56 PM

Rahul Gandhi Reacts On Congress Party Chief Post - Sakshi

సీనియర్ల వ్యతిరేకత నడుమ బయటి వాళ్లకు అవకాశం దక్కవచ్చంటూ..

చెన్నై: కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. గాంధీ కుటుంబంపై కొందరు సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన దరిమిలా.. బయటి వాళ్లకు అవకాశం దక్కవచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. రాహుల్‌ గాంధీ ఈ రేసులో ఉన్నారా? లేదా? అనే ప్రశ్న ఆయనకే ఎదురైంది. 

భారత్‌ జోడో యాత్రలో పాల్గొంట్నున రాహుల్‌ గాంధీకి మీడియా నుంచి అధ్యక్ష ఎన్నికల గురించి ప్రశ్న ఎదురైంది. ‘‘నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది పార్టీ ఎన్నికలు (పదవికి) జరిగినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఏం చేయాలో నేనో నిర్ణయంపై ఉన్నా. అందులో ఎలాంటి గందరగోళం లేదు’’ అని ఆయన తెలిపారు. తద్వారా అధ్యక్ష ఎన్నికలకు తాను దూరంగా లేననే సంకేతాలను అందించారు ఆయన. 

అందమైన దేశంలో ఈ రెండు మూడు నెలలు యాత్ర చేపట్టడం ద్వారా పరిస్థితులను అర్థం చేసుకునేందుకు నాక్కూడా ఓ అవకాశం దొరుకుతుంది. కొన్ని విషయాలపై పూర్తి స్థాయి అవగాహనతో సమర్థంగా రాటుదేలగలను అని ఆయన పేర్కొన్నారు. 

భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు నవంబర్‌17వ తేదీన పోలింగ్‌ జరగనుంది. రెండు రోజుల తర్వాత కౌంటింగ్‌ చేపట్టి.. ఫలితం ప్రకటిస్తారు. సెప్టెంబర్‌ 24 నుంచి 30 తేదీల మధ్య నామినేషన్ల ప్రక్రియ నడుస్తుంది.  గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని, పార్టీ కుదేలుకు కారణం రాహుల్‌ గాంధీనే అంటూ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న పలువురు సీనియర్ల కాంగ్రెస్‌ను వీడడం.. దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

ఇదీ చదవండి: ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఆషామాషీ కాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement