కర్ణాటకలో సంకీర్ణం వస్తుందా? కోడిమఠం స్వామీజీ జోస్యం ఇదే

Prediction of Kodimatha Swamiji About karnataka Elections 2023 - Sakshi

సాక్షి, బెంగళూరు: త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని, సంకీర్ణ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోను అధికారంలోకి రాదని కోడిమఠం స్వామీజీ జోస్యం చెప్పారు. విజయనగర జిల్లా హొసపేటెలో ఆయన మాట్లాడుతూ..  2023 అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్తును తెలియజేశారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కొందరు చర్చించుకుంటున్న నేపథ్యంలో కోడిమఠం పీఠాధికారి డాక్టర్‌ శివానంద శివయోగి రాజేంద్ర మహాస్వామీజీ భవిష్యత్‌ రాజకీయాల గురించి నర్మగర్భంగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇద్దరు గొప్ప వ్యక్తులు కనుమరుగవుతారన్నారు. ఉగాది అనంతరం గత ఏడాది కంటే మంచి వర్షాలు పడుతాయన్నారు. కరోనా వచ్చినా భయమేమీ లేదని, ప్రాణహాని ఉండదన్నారు.  

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top