మావోయిస్టుల డంప్‌ లభ్యం .. రూ.15.96 లక్షల నగదు | Police Officers Handed Over Maoist Dump At Gadchiroli | Sakshi
Sakshi News home page

గడ్చిరోలిలో మావోయిస్టుల డంప్‌ లభ్యం .. రూ.15.96 లక్షల నగదు

Jul 3 2021 9:57 AM | Updated on Jul 3 2021 10:50 AM

Police Officers Handed Over Maoist Dump At Gadchiroli - Sakshi

స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర సామగ్రి  

కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా కుద్రీ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల డంప్‌ లభ్యమైంది. ప్రత్యేక పోలీస్‌ బలగాలతో గురువారం రాత్రి కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ డంపు దొరికిందని ఎస్పీ అంకిత్‌గోయల్‌ తెలిపారు. అందులో రూ.15.96 లక్షల నగదు, మూడు డిటోనేటర్లతో పాటు వైర్‌ బండిళ్లు, వాకీటాకీ, బ్యానర్లు, కిట్‌బ్యాగులు ఉన్నాయని ఆయన శుక్రవారం విలేకరులకు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement