టీఎన్‌పీఎస్సీ కోచింగ్‌.. ఒంటరిగా ఉన్న సంతోష్‌ ప్రియపై లైంగికదాడి చేసి.. | Police Investigated Case of Santosh Priyas Murder in Vellore | Sakshi
Sakshi News home page

టీఎన్‌పీఎస్సీ కోచింగ్‌.. ఒంటరిగా ఉన్న సంతోష్‌ ప్రియపై లైంగికదాడి చేసి..

Aug 9 2022 7:57 AM | Updated on Aug 9 2022 8:44 AM

Police Investigated Case of Santosh Priyas Murder in Vellore - Sakshi

పోలీసులు అరెస్ట్‌ చేసిన మహేంద్రన్‌ (ఫైల్‌).. మృతి చెందిన సంతోష్‌ ప్రియ(ఫైల్‌)

వేలూరు (తమిళనాడు): బావిలో శవమై తేలిన సంతోష్‌ ప్రియ(22) కేసును పోలీసులు చేధించారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా కొరటి గ్రామానికి చెందిన సంతోష్‌ ప్రియ తాతయ్యతో కలిసి నివసిస్తోంది. ప్రస్తుతం టీఎన్‌పీఎస్సీ పరీక్షలు రాసేందుకు ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గత నెల 23వ తేదీన సమీపంలోని బావిలో శవమై కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: (భవిష్యత్తుపై ఎన్నో కలలు.. భర్తతో అమెరికా జీవితం గురించి ఆశలు..)

పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తెలియడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కొద్ది రోజులుగా స్విచ్ఛాఫ్‌లో ఉన్న మృతురాలి సెల్‌ఫోన్‌ సోమవారం తిరుపత్తూరు కోట సమీపంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకుని ఫోన్‌ ఉపయోగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువకుడు కొరియర్‌ కంపెనీలో పనిచేసే మహేంద్రన్‌గా తెలిసింది. ఒంటరిగా ఉన్న సంతోష్‌ ప్రియపై లైంగికదాడి చేసి అనంతరం బయటకు తెలియకుండా ఉండేందుకు గొంతు నులిమి మృతదేహాన్ని బావిలో వేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు.

చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్‌ ఇచ్చేందుకు భార్య..) 

Advertisement
 
Advertisement
Advertisement