జీ20 సదస్సుకు మోదీ

PM Narendra Modi to visit Bali from Nov 14 to16 to attend G20 summit - Sakshi

నవంబర్‌ 14–16 తేదీల్లో హాజరు

విడిగా వేర్వేరు దేశాల అధినేతలతోనూ ద్వైపాక్షిక చర్చలు

న్యూఢిల్లీ: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇండోనేసియాలోని బాలీకి వెళ్లనున్నారు. నవంబర్‌ 14–16 తేదీల్లో సదస్సుకు హాజరవుతారు. అదే తేదీల్లో సదస్సుకు విచ్చేస్తున్న పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బగ్చీ గురువారం ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ‘‘ సమిష్టిగా కోలుకుందాం.

మరింతగా బలీయమవుదాం.. అనే ఇతివృత్తంతో కొనసాగే ఈసారి జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్, ప్రధాని మోదీ సహా భాగస్వామ్యదేశాల అగ్రనేతలు పాల్గొంటారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు ఆహారం, ఇంధన భద్రత, ఆరోగ్యంæ అంశాలపైనా చర్చిస్తారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు నాయకత్వం వహిస్తున్న ఇండోనేసియా అధ్యక్షుడు జోకో సదస్సు చివరి రోజున తదుపరి నాయకత్వ పగ్గాలను మోదీకి లాంఛనంగా ఇవ్వనున్నారు’ అని బగ్చీ చెప్పారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top