వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయండి: మోదీ | PM Narendra Modi Review Meeting On Coronavirus With States | Sakshi
Sakshi News home page

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయండి: మోదీ

May 6 2021 5:25 PM | Updated on May 6 2021 5:36 PM

PM Narendra Modi Review Meeting On Coronavirus With States - Sakshi

ఢిల్లీ: భారత్‌లో క‌రోనా వైర‌స్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా కరోనా ప‌రిస్థితిపై స‌మీక్షించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుప‌డుతున్నందున దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు.  లాక్డౌన్లు అమ‌ల్లో ఉన్నా ప్ర‌జ‌లు వ్యాక్సిన్ వేసుకునేందుకు వెన‌కాడ‌రాద‌ని, వ్యాక్సినేష‌న్ డ్యూటీలో ఉన్న ఆరోగ్య సిబ్బందిని వేరే విధుల‌కు మ‌ళ్లించ‌రాద‌ని సూచించారు. ఆరోగ్య మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌రిచేందుకు రాష్ట్రాల‌కు స‌హ‌క‌రించాల‌ని అధికారులు, కేంద్ర మంత్రుల‌ను ప్రధాని కోరారు.

ఈ సందర్భంగా 12 రాష్ట్రాల్లో ల‌క్ష‌కు పైగా యాక్టివ్ కేసులున్నాయ‌ని ప్ర‌ధానికి అధికారులు వివ‌రించారు. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న జిల్లాల వివ‌రాల‌ను నివేదించారు. క‌రోనా చికిత్స‌లో ఉప‌యోగించే మందుల ల‌భ్య‌త‌ను ప్ర‌ధాని స‌మీక్షించారు. రెమిడెసివిర్‌ స‌హా క‌రోనా ఔష‌ధాల ఉత్ప‌త్తిని పెంచిన‌ట్టు అధికారులు ప్ర‌ధానికి వివ‌రించారు.  కాగా ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షాలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement