తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్‌ | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్‌

Published Thu, May 6 2021 9:30 PM

PM Narendra Modi Phone Calls To Telugu States CMs On Covid Situations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి ఎలా ఉంది? కట్టడికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? వ్యాక్సిన్‌ పంపిణీ, ఆక్సిజన్‌ కొరత వంటి తదితర విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ వైరస్‌ విస్తరణ, నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ఇద్దరూ చర్చించారు. కోవిడ్‌ వైరస్‌ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, వైరస్‌ సోకిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలపై సీఎం జగన్‌ ప్రధానికి వివరించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచి, కోవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానిక సీఎం జగన్‌ వివరించారు.

సీఎం కేసీఆర్‌కు..
అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో కూడా ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి కూడా ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం ఒడిశా, జార్ఖండ్‌ ముఖ్యమంత్రుల్రతో కూడా ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై వివరాలు తెలుసుకుంటున్నారు.

చదవండి: ఒకే రోజు లాక్‌డౌన్‌ ప్రకటించిన రెండు రాష్ట్రాలు
చదవండి: కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement