పేదరికంపై సాంకేతికాస్త్రం: మోదీ | Sakshi
Sakshi News home page

పేదరికంపై సాంకేతికాస్త్రం: మోదీ

Published Thu, Nov 17 2022 5:24 AM

PM Narendra Modi inaugurates Bengaluru Tech Summit - Sakshi

బెంగళూరు: పేదరిక నిర్మూలనకు సాంకేతికతను తిరుగులేని అస్త్రంగా భారత్‌ ఉపయోగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆసియాలో అతి పెద్ద టెక్నాలజీ ఈవెంట్‌ అయిన 25వ బెంగళూరు టెక్‌ సమిట్‌ (బీటీఎస్‌)ను ఉద్దేశించి ఇండొనేసియాలోని బాలి నుంచి బుధవారం ఆయన వీడియో సందేశమిచ్చారు. భారత్‌లో చిరకాలం పాటు వేళ్లూనుకుని పోయిన అధికార అలసత్వాన్ని తమ హయాంలో నిర్మూలించామన్నారు.

‘‘భారత ప్రగతి ప్రస్థానంలో కొన్నేళ్లుగా అన్ని అంశాలూ అద్భుతంగా కలిసొస్తున్నాయి. ఆరోగ్యం, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌ వంటి అన్ని రంగాల్లోనూ అంతర్జాతీయంగా భారతీయులు సారథ్య స్థానాల్లో రాణిస్తున్నారు. మాతో కలిసి పని చేసేకుందకు మీకిదే స్వాగతం’’ అని ఇన్వెస్టర్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ ఇండెక్స్‌లో 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్‌ ఈ ఏడాది 40 స్థానానికి ఎగబాకిందన్నారు. ‘భారత్‌లో గత ఎనిమిదేళ్లలో స్మార్ట్‌ఫోన్లు 15 కోట్ల నుంచి 75 కోట్లకు పెరిగాయి’ అని చెప్పుకొచ్చారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement