విపత్తులను ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలి  | PM Narendra Modi calls for global unity to build disaster-resilient infrastructure | Sakshi
Sakshi News home page

విపత్తులను ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలి 

Jun 8 2025 5:41 AM | Updated on Jun 8 2025 5:41 AM

PM Narendra Modi calls for global unity to build disaster-resilient infrastructure

ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు  

న్యూఢిల్లీ:  విపత్తులను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విపత్తులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. అన్ని దేశాలు కలిసి పనిచేస్తేనే నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని స్పష్టంచేశారు. 

‘డిజాస్టర్‌ రీసైలియెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌–2025’అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ శనివారం వీడియో సందేశం ఇచ్చారు. విపత్తుల నివారణ విషయంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ విధానాలు పరస్పరం పంచుకోవడానికి గ్లోబల్‌ డిజిటల్‌ వేదిక, నిధుల సేకరణ అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. 

విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థతోపాటు దేశాల మధ్య సహకారం కచి్చతంగా అవసరమని అన్నారు. ఇండియా ఏర్పాటు చేసిన సునామీ వార్నింగ్‌ సిస్టమ్‌తో 29 దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని గుర్తుచేశారు. కాలుష్యం, వాతావరణ మార్పులతోపాటు ప్రకృతి విపత్తుల సముద్ర తీర ప్రాంతాలు, దీవులకు పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement