అనంత్‌ దంపతులను ఆశీర్వదించిన మోదీ | PM Narendra Modi Attends Anant Ambani-Radhika Merchant Shubh Aashirwad Ceremony | Sakshi
Sakshi News home page

అనంత్‌ దంపతులను ఆశీర్వదించిన మోదీ

Jul 14 2024 6:14 AM | Updated on Jul 14 2024 6:14 AM

PM Narendra Modi Attends Anant Ambani-Radhika Merchant Shubh Aashirwad Ceremony

ముంబై: అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రిలయన్స్‌ సంస్థల అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ–రాధికా మర్చంట్‌ దంపతులను ఆశీర్వదించారు. 

శుక్రవారం రాత్రి జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్లో జరిగిన పెళ్లి వేడుకలకు ప్రపంచ ప్రముఖులంతా తరలి రావడం తెలిసిందే. శనివారం జరిగిన వివాహ విందులో పాల్గొన్న మోదీకి ముకేశ్‌–నీతా అంబానీ దంపతులు స్వాగతం పలికారు. ‘శుభ్‌ ఆశీర్వాద్‌’ పేరిట జరిగిన విందు వేడుకకు కూడా తారాలోకంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార, రాజకీయ తదితర రంగాల దిగ్గజాలు హాజరై సందడి చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement