10న ప్రధాని మోదీ వయనాడ్‌ సందర్శన | PM Modi will Visit Wayanad on August 10 | Sakshi
Sakshi News home page

10న ప్రధాని మోదీ వయనాడ్‌ సందర్శన

Aug 8 2024 12:37 PM | Updated on Aug 8 2024 3:26 PM

PM Modi will Visit Wayanad on August 10

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో  భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. కేరళలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న వయనాడ్‌లో పర్యటించనున్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్‌లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం కేరళలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో 10వ రోజు(గురువారం) కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న అవశేషాలను వెలికితీసేందుకు పెద్ద సంఖ్యలో స్నిఫర్ డాగ్‌లను మోహరించారు. ఐఎఎఫ్‌ హెలికాప్టర్లు చలియార్ నది వెంబడి  ప్రాంతాలలో ప్రత్యేక శోధన బృందాలను ల్యాండ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలోని బాధితులకు  తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. పునరావాసం మూడు దశల్లో జరుగుతుందని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement