ట్రైనీ ఐపీఎస్‌లను ఉద్దేశించి మోదీ ప్రసంగం | PM Modi to Interact With IPS Probationers On 31 July 2021 | Sakshi
Sakshi News home page

ట్రైనీ ఐపీఎస్‌లను ఉద్దేశించి మోదీ ప్రసంగం

Jul 31 2021 11:50 AM | Updated on Jul 31 2021 6:57 PM

PM Modi to Interact With IPS Probationers On 31 July 2021 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలోని ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్‌) ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మోదీ వర్చువల్‌గా ట్రైనీ ఐపీఎస్‌లతో సంభాషిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా హజరయ్యారు.

గతేడాది సెప్టెంర్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ట్రైనీ ఐపీఎస్‌లతో సంభాషించారు. ఐపీఎస్‌ అధికారులు తమ ఉద్యోగం, యూనిఫామ్‌ని గౌరవించాల్సిందిగా సూచించారు. కరోనా కాలంలో పోలీసులు చేసిన సేవలు సామాన్యుల మదిలో నిలిచిపోయాయని మోదీ తెలిపారు. ‘‘అనుకోని.. అకస్మాత్తు ప్రమాదాలను గుర్తించి.. వాటిని సమర్థంగా ఎదుర్కొవడమే మీ వృత్తి. విధి నిర్వహణలో మీరు ఎంతో ఒత్తిడికి గురవుతారు. అలాంటి సమయంలో మీ శ్రేయోభిలాశులను కలిసి.. వారితో మాట్లాడండి.. వారి సూచనలు తీసుకొండి’’ అని మోదీ వారికి సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement