పాక్‌ కాల్పులతో పెళ్లిళ్లకు చిక్కులు | Sakshi
Sakshi News home page

పాక్‌ కాల్పులతో పెళ్లిళ్లకు చిక్కులు

Published Sat, Oct 28 2023 5:57 AM

Pak Firing Disrupts Weddings In Villages Along IB - Sakshi

శ్రీనగర్‌: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్‌ సైన్యం జరుపుతున్న విచక్షణారహిత కాల్పులతో జమ్మూలోని పలు గ్రామాల్లో పెళ్లిళ్లకు చిక్కులొచ్చి పడ్డాయి. దాంతో చివరి నిమిషంలో పలు పెళ్లిళ్లకు వేదికను మార్చుకోవాల్సి రావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు.

భారీ కాల్పుల దెబ్బకు అతిథులు పెళ్లి విందు మధ్య నుంచే అర్ధంతరంగా నిష్క్రమిస్తున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి. పాక్‌ రేంజర్లు ఇలా కాల్పులకు తెగబడటం 2021 కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇదే తొలిసారి. గురువారం రాత్రి నుంచీ అరి్నయా తదితర ప్రాంతాలపై కాల్పులు ఏడు గంటలకు పైగా కొనసాగాయి. మరోవైపు వరి కోతల వేళ కాల్పులకు భయపడి కూలీలెవరూ పొలాలకు కూడా వెళ్లడం లేదు.

బంకర్లోనే పాఠాలు!
కాల్పుల భయంతో జమ్మూ జిల్లాలో పలు స్థానిక స్కూళ్లు మూతబడ్డాయి. అయితే సరిహద్దుకు సమీపంలోని షోగ్‌పూర్‌లో ఉన్న సర్కారీ పాఠశాల మాత్రం శుక్రవారం భూగర్భ బంకర్లలో నడిచింది! తమ ఇంట్లోవాళ్లు భయపడ్డా తాను మాత్రం స్కూలుకు హాజరయ్యానని సునీతా కుమారి అనే విద్యారి్థని చెప్పింది. ఆమెతో పాటు దాదాపు 20 మంది విద్యార్థులు స్కూల్‌లోని బంకర్లో పాఠాలు విన్నారు.

Advertisement
 
Advertisement