
సాక్షి, శివమొగ్గ: కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని మోదీ కేవలం తన గురించి మాత్రమే చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘భూమిపై మోదీ ఒక్కరే లేరు. సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. కానీ ఆయన మరే విషయమూ మాట్లాడటం లేదు’’ అన్నారు.
శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా బాళేబైలిలో మంగళవారం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. మోదీ మొదటగా సామాన్య ప్రజల గురించి మాట్లాడాలని సూచించారు. కర్ణాటకలో సొంత పార్టీ నేతల అవినీతిపై ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.