Omicron Effect: సుప్రీంలో వచ్చే రెండు వారాలు వర్చువల్‌ విచారణలే

Omicron Effect: Virtual Trials In Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈనెల 3వ తేదీ నుంచి రెండు వారాలపాటు అన్ని కేసులను వర్చువల్‌ విధానంలోనే విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం ఆదివారం సాయంత్రం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రస్తుతం అమలవుతున్న హైబ్రిడ్‌ విధానాన్ని కూడా కొద్దికాలం నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొంది.

దేశంలో మహమ్మారి తీవ్రమవుతున్న సమయంలో 2020 మార్చి నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా కేసులను విచారిస్తోంది. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో...సుదీర్ఘ కాలం వాదనలు వినాల్సిన అవసరమున్న కేసులను బుధ, గురువారాల్లో ప్రత్యక్షంగా విచారిస్తామంటూ 2021 అక్టోబర్‌ 7వ తేదీన జారీ చేసిన సర్క్యులర్‌లో సుప్రీంకోర్టు తెలిపింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top