సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ యాక్సిడెంట్‌!

Odisha Train Accident: coromandel express Video Before Crashed Viral - Sakshi

Balasore Train Accident Video Viral: ఒడిశా బాలేశ్వర్‌ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద వీడియో ఇదేనంటూ ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పైగా ఒడిశా ఛానెల్స్‌ కూడా ఈ వీడియోను అధికారికమేనంటూ తెరపైకి తెచ్చాయి.  ప్రమాదానికి ముందు క్షణాలంటూ ఆ వీడియో ఆధారంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మీరు ఒకవేళ సున్నిత మనస్కులు అయితే గనుక దయచేసి ఈ వీడియో చూడకండి. 

ఒడిశాలో జూన్‌ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి ముందు వీడియో అంటూ ఒకటి వైరల్‌ అవుతోంది. అందులో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌గా చెప్తున్న రైలులో..  రైల్వే సిబ్బంది కోచ్ ఫ్లోర్ ను శుభ్రం చేస్తున్నాడు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ప్రయాణికులు ప్రశాంతంగా కొందరు పడుకోగా.. మరికొందరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరో తన మొబైల్‌లో అదంతా రికార్డు చేస్తున్నారు. అంతలో.. 

ఒక్కసారిగా కల్లోల పరిస్థితి.. హాహాకారాలతో వీడియో ఆగిపోయింది. ఈ వీడియోనే కోరమాండల్‌ప్రమాద వీడియో అంటూ విస్తృతంగా షేర్ అవుతోంది. 

కానీ ఇది ఒడిశా రైలు ప్రమాదానికి చెందినదా ? కాదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైల్వేశాఖ, ఒడిశా అధికార యంత్రాంగం సైతం దీనిపై స్పందించాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ఒడిశా ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. ఈ మృతదేహాల్లో ఇంకా 82 మందిని గుర్తించాల్సి  ఉంది. బాడీలు పాడైపోయే అవకాశం ఉండడంతో వీలైనంత త్వరగా వాటిని బంధువులకు అప్పగించే ప్రయత్నంలో అధికారులు తలమునకలయ్యారు. డీఎన్‌ఏ టెస్టులు సహా చివరి ఆప్షన్‌గా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ని  ఉపయోగించాలని నిర్ణయించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top