
కోల్‌కతా: దేశంలో పౌరసత్వ (సవరణ) చట్టం–సీఏఏ అమలును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. బుధవారం ఆయన కోల్‌కతాలో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటైన భారీ ర్యాలీలో మాట్లాడారు. సీఏఏను పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. బెంగాల్లోకి విదేశీయుల చొరబాట్లకు మమత దన్నుగా ఉండటమే అందుకు కారణమని షా ఆరోపించారు. రాష్ట్రాన్ని తృణమూల్ సర్కారు సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.
‘‘ప్రభుత్వం నిండా అవినీతిలో మునిగిపోయింది. మమత హయాంలో రాష్ట్రంలో రాజకీయ హింస, ముస్లిం సంతుïÙ్టకరణ చర్యలు పరాకాష్టకు చేరాయి’’ అని ఆరోపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమత సర్కారును సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టి మమత సర్కారు పతనానికి రంగం సిద్ధం చేయండి. మోదీ కూడా బెంగాల్ ప్రజల వల్లే నేను మూడోసారి ప్రధాని అయ్యాను అని చెప్పుకునే స్థాయిలో రాష్ట్రంలో బీజేపీని ఘనంగా గెలిపించండి’’ అని కోరారు.