దీపావళి తర్వాత నితీష్‌ ప్రమాణ స్వీకారం

Nitish Kumar Likely To Take Oath As Chief Minister on November 16 - Sakshi

పట్నా ‌: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. దీపావళి తర్వాత నవంబర్‌ 16న సీఎంగా నితీష్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో జేడీయూ గెలిచినప్పటికీ.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీష్‌ కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఏడోసారి జేడీయూ నేత నితీష్‌ కుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా తనకు అఖండ విజయం అందించిన ప్రజలకు, ఇందుకు సహకరించిన ప్రధాని మోదీకి ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.  (నితీష్‌ కుమారే బీహార్‌ సీఎం: ఎన్డీయే) 

ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయమై జేడీ(యూ) కోర్ కమిటీ నిన్నరాత్రి బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో జేడీయూతో పోలిస్తే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మంత్రివర్గంలో అధిక వాటాను, కీలక శాఖలను డిమాండ్‌ చేసే అవకాశముంది. కాగా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది.  (నితీష్‌ సీఎం అయితే మాదే క్రెడిట్‌: శివసేన)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top