పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన విషయాలు | NIA Chief Reaches Pahalgam To Review Investigation | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన విషయాలు

May 1 2025 12:52 PM | Updated on May 1 2025 2:04 PM

NIA Chief Reaches Pahalgam To Review Investigation

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిలో కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఉగ్రదాడి జరిగిన బైసరన్‌ వ్యాలీకి ఎన్‌ఐఏ డీజీ చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో మూడు పర్యాటక ప్రాంతాలను ఉగ్రవాదులు రెక్కీ చేసినట్లు తేలింది. ఏప్రిల్‌ 15న జమ్మూ కశ్మీర్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ వద్ద ఉగ్ర వాదులు రెక్కీ నిర్వహించారు.

మరో వైపు, బైసారన్‌ గడ్డి మైదానంలో సుందర కశ్మీర్‌ అందాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారని నిర్ధారించుకున్నాకే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారన్న వాదనకు బలం చేకూరుతోంది. పహల్గాంలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విడుదల చేయగా మహారాష్ట్రలోని జల్నా జిల్లా వాసి ఆ ఊహాచిత్రాల్లోని ఒక ఉగ్రవాదిని గుర్తుపడ్డారు.

ఆ ఉగ్రవాది తనతో పాశవిక దాడికి ఒక రోజు ముందు అదే ప్రాంతంలో మాట్లాడానని ఆదర్శ్‌ రౌత్‌ అనే యువకుడు వెల్లడించారు. నాటి ఘటన వివరాలను రౌత్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘ ఏప్రిల్‌ 22వ తేదీ మధ్యహ్నం ఉగ్రవాదులు దాడిచేశారు. అయితే అంతకు ఒకరోజు ముందు అంటే 21వ తేదీన అదే బైసారన్‌లో నేను పర్యటించా. గుర్రపు స్వారీ చేశా. ఆకలేసి అక్కడి మ్యాగీ స్టాల్‌ వద్ద ఆగా. అదే సమయంలో ఈ అనుమానిత ఉగ్ర వాది నా దగ్గరకు వచ్చాడు.

‘నువ్వు హిందువు కదా. కశ్మీర్‌ వాడిలా లేవు’ అని నాతో అనేసి కాస్తంత దూరం నిల్చున్నాడు. అక్కడ ఇంకో వ్యక్తితో మాట్లాడుతూ ‘ఈరోజు జనం తక్కువగా వచ్చినట్లున్నారుగా’ అని అనేసి ఇద్దరూ వెళ్లిపో యారు. అతను ఎందుకు మతం గురించి అడిగా డో అర్థంకాలేదు. జనం తక్కువగా వచ్చిన విష యం గురించి ఎందుకు చర్చించుకున్నారో అస్స లు బోధపడలేదు. కానీ కాల్పుల ఘటన, ఊహా చిత్రాల్లో ఇతని ఫొటో చూశాక విషయం పూర్తిగా అర్థమైంది’’ అని ఆదర్శ్‌ రౌత్‌ చెప్పారు. విషయాలన్నీ పూసగుచ్చినట్లు ఎన్‌ఐఏకు ఈ–మెయిల్‌లో వివరంగా రాశానన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement