కొత్త రకం చేపను కనిపెట్టిన సీఎం తనయుడు!

New Freshwater Fish Discovered from Western Ghats By Tejas Thackrey - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ కనుమలు శాస్త్రవేత్తలు స్కిస్తురా జాతికి చెందిన కొత్తరకం చేపను కనుగొన్నారు. ఈ చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. చాలా చిన్న అందంగా, బంగారపు రంగులో పైన కొద్దిగా వెంట్రుకలు కలిగి చాలా చూడముచ్చటగా కనిపిస్తాయి. ఇవి ఆక్సిజన్‌ శాతం ఎక్కువగా ఉండే మంచి నీటి చెరువులతోనే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. దీనిని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే తనయుడు తేజస్‌ థాక్రే, ఐసీఏఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పోర్టుబ్లెయర్‌కు చెందిన జయసింహన్‌ ప్రవీణ్‌రాజ్‌, అండన్‌ వాటర్‌ ఫోటోగ్రాఫర్‌ శంకర్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ కలిసి పశ్చిమ కనుమలలో కనుగొన్నారు.

దీనికి ‘స్కిస్తురా హిరణ్యాక్షి’ అని నామకరణం చేశారు. ఇది హిరణ్యాక్షి అనే నదిలో లభించడం వల్ల దీనికి ఈ పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను వారు ఆక్వా ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇక్తాలజీలో ప్రచురించారు. హిరణ్యాక్షి అంటే బంగారపు రంగు జుట్టు  కలది అనే అర్థం కూడా వస్తుండటంతో ఈ పేరు చేపను వర్ణించడానికి కూడా సరిపోతుంది. ఇక ఈ చేపను తేజస్‌థాక్రే 2012లోనే కనుగొన్నారని ప్రవీణ్‌ రాజ్‌ తెలిపారు. దాని తరువాత 2017 లో ఈ జాతికి సంబంధించిన మరిన్ని చేపలను కనుగొన్నట్లు ప్రవీణ్‌ చెప్పారు. దీంతో దీని మీద మరింత రీసెర్చ్‌ చేసి దీనికి సంబంధించిన వివరాలను జర్నల్‌లో పొందుపర్చారు. చదవండి: నేను మోదీ హనుమాన్‌ని!

  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top