నీట్‌ రీటెస్ట్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ జారీ  | NEET UG 2026 Re-Exam City Intimation Slip Released | Sakshi
Sakshi News home page

నీట్‌ రీటెస్ట్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ జారీ 

Jun 8 2026 5:11 AM | Updated on Jun 8 2026 6:23 AM

NEET UG 2026 Re-Exam City Intimation Slip Released

న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్‌–యూజీ 2026 రీ టెస్ట్‌కు సంబంధించిన ఎగ్జామ్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను ఆదివారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. రీ టెస్ట్‌ రాసే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందనే సమాచారాన్ని ఈ స్లిప్‌ ద్వారా చూసుకోవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. అప్లికేషన్‌ నంబర్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకుని ఈ స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ ఎక్స్‌లో కోరింది. ఈ స్లిప్‌ అడ్మిట్‌ కార్డు కాదు, కేవలం అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉన్నదీ తెలుసుకునేందుకు మాత్రమేనని తెలిపింది. 

దాదాపు అభ్యర్థులందరికీ మొదటి ప్రాధాన్యంగా పేర్కొన్న నగరాల్లోనే పరీక్ష కేంద్రాలను కేటాయించామని తెలిపింది. త్వరలోనే రీ టెస్ట్‌ అడ్మిట్‌ కార్డులను జారీ చేయనున్నట్లు ఎన్‌టీఏ వివరించింది. పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు, అడ్మిట్‌ కార్డు విడుదల అప్‌డేట్‌ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్లలో వచ్చే ప్రకటనలను చూడాలని సూచించింది. నీట్‌ రీ టెస్ట్‌ 21వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న 551 నగరాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు జరగనుండటం తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement