June 21
-
నాన్నకు ప్రేమతో..నాన్నకు ప్రేమతో..
ప్రతి స్టేజీ మీద అవార్డ్ అందుకునే చేతుల వెనుక, ఆ చేతుల్ని చిన్నప్పుడు స్కూల్ గేట్ దగ్గర వదిలిపెట్టి, వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న ఒక జత కళ్లు ఉంటాయి. ఆ కళ్ల పేరే నాన్న. ఆటగాడు స్టేడియంలో సిక్స్ కొడితే కెమెరా అతడి మొహం చూపిస్తుంది. కానీ గ్యాలరీలో సీట్ దొరక్క నిలబడి, ‘వాడు మా అబ్బాయిరా’ అని పక్కవాడి భుజం తడుతూ గర్వంగా చెప్పే మనిషిని చూపించదు. ఆ మనిషి నాన్న.అమ్మాయి ఐ.ఏ.ఎస్ అయ్యి వార్తల్లోకి వస్తే, ‘మా ఊరి అమ్మాయి’ అని ఊరంతా సంబరపడుతుంది. కానీ ఆ అమ్మాయిని రాత్రిళ్లు దీపం కింద కూర్చోబెట్టి, తోడుగా కునికిపాట్లు పడుతూ కూచున్న నీడని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఆ నీడ పేరు నాన్న.నాన్న ‘లేదు’ అనే మాటని ఇంట్లో పిల్లల ముందు పలకడు. అడిగితే ఆయన జవాబు ఒక్కటే ‘తీసుకో నాన్నా’. నాన్న జేబుకి చిల్లు ఉంటుంది. కానీ కొడుకు పాకెట్ మనీకి లోటు ఉండదు. నాన్న చెప్పులు అరిగిపోతాయి, కానీ కూతురి స్కూల్ షూస్ కొత్తగా మెరుస్తూ ఉంటాయి.నాన్న తన కలల్ని ష్యూరిటీగా ఇచ్చి, పిల్లల కలలకి డౌన్ పేమెంట్ కడతాడు.పిల్లల విజయం వెనుక అమ్మ ఉంటుంది నిజమే. కానీ ఆ అమ్మ చేతిలో గరిటె ఆగకుండా తిప్పడం వెనుక, ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ తొక్కుతూ డ్యూటీకి వెళ్లిన, ఫ్యాక్టరీలో ఓవర్‌టైం చేసిన, ఎండలో ఆటో నడిపిన ఒక మనిషి చెమట ఉంటుంది. ఆ మనిషి నాన్న.ఫాదర్స్ డే జూన్ 21న. ఈ సందర్భంగా సమాజంలో ఎందరో సామాన్య అసామాన్య నాన్నలను గుర్తు చేసుకుందాం.రోజుకో నాన్నకి నమస్కరించుకుందాం.ఫోటోలో కనిపించని, ఫ్లెక్సీలో పేరు లేని, అవార్డ్ అందుకోని నాన్నలందరికీ... ఈ కాలమ్ అంకితం.నాణెం కాదు ప్రాణంగొంతెమ్మె కోరికలు కోరకు.. ఉన్నదాంట్లో సర్దుకో..అన్నమాటను చిన్నప్పుడు మనమంతా ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. మరీ ముఖ్యంగా దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఈమాట సర్వసాధారణం.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లా, కేసరపాత్ గ్రామంలో నివసించే బజరంగ్ రామ్ భగత్‌ది అలాంటి కుటుంబమే. అతను గుడ్లు, శెనగలు అమ్ముతూ వ్యవసాయం చేసుకునే ఒక సన్నకారు రైతు. అతని కుమార్తె చంపా భగత్ బీకామ్ చదువుతోంది. తనకేమో స్కూటీ నడపాలని, కాలేజ్‌కి వెళ్లాలని చాలా ఆశ. పదేపదే స్కూటీ కావాలని చంపా నాన్నని అడిగేది. కాని స్కూటీ ధర అక్షరాలా లక్ష. అంత డబ్బు భగత్ దగ్గర లేదు. అప్పు చేసే ధైర్యం లేదు. అలాగని కూతురు మనసుని నొప్పించాలనీ లేదు. అందుకే ప్రతిరోజూ వ్యాపారంలో మిగిలే పది, ఇరవై రూపాయల నాణేలను పోగు చేశాడు. అలా దాదాపు ఏడు నెలలు పోగు చేశాక కూతురుని వెంటబెట్టుకుని బైక్ షో రూమ్‌కి వెళ్లాడు. అక్కడ సంచుల నిండా ఉన్న నాణేలను తెరచి నేలమీద పోయడం చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. సిబ్బంది దాదాపు మూడు గంటలపాటు నాణేలను లెక్కపెట్టగా నలభైవేలకు తేలింది. ఆ మొత్తాన్ని అక్కడ డౌన్ పేమెంట్‌గా కట్టి కుమార్తెకు స్కూటీని కొనిచ్చాడు. స్కూటీ నడపాలన్న ఆశను కుటుంబ ఆర్థిక స్థోమత సవాల్ చేసినా, కూతురు మీదున్న ఆ తండ్రి ప్రేమ పేదరికాన్ని జయించి చూపింది.నాన్నేనెట్వర్క్పిల్లల కోసం తండ్రులు ఎంతటి త్యాగానికైనా... కష్టానికైనా వెనుతీయరనడానికి ఇదో ఉదాహరణ. దక్షిణ కర్ణాటకలోని బల్లక్క గ్రామంలో నారాయణ అనే రైతు తన కూతురు చదువు కోసం వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. గ్రామంలో నెట్వర్క్ లేకపోవడంతో నారాయణ కూతురు గ్రామం బయటకు వెళ్లి ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేది. నెట్వర్క్కి తోడుగా ఒకరోజు ఊరిలో భారీ వర్షం కురిసింది. ఇప్పుడు క్లాసులకు హాజరు కావడం మరింత జటిలంగా మారింది. అయినా సరే తన కూతురు క్లాసులకు మిస్ కాకూడదని నారాయణ కూడా వచ్చి ఇలా గొడుగుపట్టుకుని నిలబడ్డాడు. ఒకవైపు కూతురు తడవకుండా చూసుకుంటూ మరోవైపు తను తడుస్తూ నిలుచున్నాడు. ఈ హృద్యమైన దృశ్యాన్ని చూసిన స్థానిక జర్నలిస్ట్ మహేష్ పుచ్చప్పాడి తన కెమెరాలో క్లిక్‌మనిపించి ట్విట్టర్లో పెట్టాడు. ప్రతి రోజూ సాయంత్రం 4గంటలకు నారాయణ తన కూతురు ఆన్లైన్ క్లాసుల కోసం ఇదే ప్రదేశానికి తీసుకువస్తున్నాడని, మారుమూల ప్రాంతంలో నెట్వర్క్ లేక ప్రజలు పడుతున్న అవస్థలకు ఇదొక ఉదాహరణ అంటూ పేర్కొన్నాడు.స్విగ్గీ డాడీకొన్ని నెలల కిందట వైరల్ అయిన ఫొటో ఇది. స్విగ్గీలో పని చేస్తున్న ఓ వ్యక్తి తనతో పాటు కూతుర్ని కూడా తీసుకెళ్లాడు. ఓ అపార్ట్మెంట్లో డెలివరీ ఇచ్చాక కాస్త సమయం దొరికింది. అపార్ట్మెంట్ మెట్లు దిగుతూ ఓ చోటు చూసుకుని కూర్చుని పుస్తకం తీసి తన కూతురికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చక్కటి దృశ్యాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే..కొన్ని గంటల్లోనూ వేలాది లైకులు, కామెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. కూతురు కోసం కష్టపడుతున్న తండ్రిని శభాష్ అని మెచ్చుకుంటూ రియల్ హీరో స్విగ్గీ డాడీ అంటూ పోస్ట్‌లు చేశారు. తండ్రి అన్నవాడు ఎంత కష్టపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా అదంతా బిడ్డ కళ్లల్లో ఆనందం చూడ్డానికేనని, బిడ్డకి మంచి భవిష్యత్ ఇవ్వడానికేనని ఈ ఫొటో నిరూపించింది. నిర్వహణ : శ్రావణ్ జయ -
నీట్ రీటెస్ట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ జారీ
న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్–యూజీ 2026 రీ టెస్ట్‌కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. రీ టెస్ట్ రాసే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందనే సమాచారాన్ని ఈ స్లిప్ ద్వారా చూసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకుని ఈ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ ఎక్స్‌లో కోరింది. ఈ స్లిప్ అడ్మిట్ కార్డు కాదు, కేవలం అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉన్నదీ తెలుసుకునేందుకు మాత్రమేనని తెలిపింది. దాదాపు అభ్యర్థులందరికీ మొదటి ప్రాధాన్యంగా పేర్కొన్న నగరాల్లోనే పరీక్ష కేంద్రాలను కేటాయించామని తెలిపింది. త్వరలోనే రీ టెస్ట్ అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నట్లు ఎన్టీఏ వివరించింది. పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు, అడ్మిట్ కార్డు విడుదల అప్డేట్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్లలో వచ్చే ప్రకటనలను చూడాలని సూచించింది. నీట్ రీ టెస్ట్ 21వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న 551 నగరాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు జరగనుండటం తెల్సిందే. -
జూన్ 21న నీట్ రీఎగ్జామ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–యూజీ రీఎగ్జామ్ జూన్ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈ నెల 3న నిర్వహించిన నీట్(యూజీ)–2026 పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షలో ఇకపై ఎలాంటి అవకతవకలు జరగకుండా సంస్కరణలు ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నీట్(యూజీ) పరీక్షలో అక్రమాలను సహించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రద్దయిన నీట్‌ను జూన్ 21న మళ్లీ నిర్వహించబోతున్నామని, ఈసారి పరీక్ష వ్యవధిని మరో 15 నిమిషాలు పెంచినట్లు తెలిపారు. ఎక్కడ పరీక్ష రాయాలన్నది అభ్యర్థులు నిర్ణయించుకోవచ్చని, జూన్ 14 కల్లా అడ్మిట్ కార్డులు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నీట్ అభ్యర్థులకు రవాణా ఏర్పాట్లను కేంద్రం సమన్వయం చేస్తుందన్నారు. ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా పరీక్షకు హాజరు కావాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అభ్యర్థులకు ధర్మేంద్ర ప్రధాన్ భరోసా ఇచ్చారు. పొరపాట్లకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వం మాఫియా కుట్రలు, ధన బలం వంటివి విద్యార్థుల మెడికల్ సీటును లాక్కోవాలని తాము కోరుకోవడం లేదని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమన్నారు. ఇప్పటిదాకా జరిగిన దానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. గెస్ పేపర్ ముసుగులో కొన్ని ప్రశ్నలు పరీక్షకు ముందే బయటకు వచ్చాయంటూ ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా ప్రాథమిక విచారణ ప్రారంభించామని చెప్పారు. మే 3న పరీక్ష జరిగే, 7న ఫిర్యాదులు వచ్చాయన్నారు. పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తోందని, దోషులను శిక్షించడం తథ్యమని పేర్కొన్నారు. గతంలో నీట్ పరీక్షలో అక్రమాలు బయటపడిన తర్వాత రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సులను అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. అయినప్పటికీ ఈ ఏడాది పేపర్ లీకేజీ ఘటన జరిగిందని, అందుకే మొదటి చర్యగా పరీక్షను రద్దు చేశామని తెలియజేశారు. నీట్ విషయంలో ఎవరైనా భయాందోళనలు, అవాంతరాలను సృష్టిస్తే కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. మన వ్యవస్థను విశ్వసించాలి ఓఎంఆర్ విధానంతో పోలిస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం కొంత మెరుగైనదని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా పరీక్షకు కొంత రక్షణ ఉంటుందన్నారు. మరోవైపు సైబర్ నేరాలు పెద్ద సమస్యగా మారాయని చెప్పారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో సవాళ్లు ఉన్నప్పటికీ, మన దేశ వ్యవస్థను మనం విశ్వసించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో జరిగే రీటెస్టుకు సిద్ధం కావాలని అభ్యర్థులకు సూచించారు. ఏ నగరంలో పరీక్ష రాయాలో నిర్ణయించుకోవడానికి వారం రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. నీట్ టెస్టు జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల దాకా జరుగుతుందన్నారు. -
2020 యుగాంతం: అంతా ఉత్తుత్తిదే
న్యూఢిల్లీ: డూమ్స్‌డే ప్రవచనాలు, మయాన్ క్యాలెండర్ ప్రకారం జూన్ 21, 2020 నాటికి ప్రపంచం అంతమైపోతుందని కొంతమంది సిద్దాంతకర్తలు పేర్కొడనంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అదేరోజు అమావాస్య, సూర్యగ్రహణం కూడా రావడంతో ఇది నిజమే అయ్యింటుందని భావించి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. నిన్న(ఆదివారం) 2020 జూన్ 21 ముగియడంతో అదంతా ఉత్తుత్తిదే అని తెలీంది. అయితే ఈ ఏడాది 2020లో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు సోకి.. లక్షల్లో మరణించడంతో మయాన్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ప్రపంచం అంతమైపోతుందని సిద్దాంతకర్తలు అంచనా వేశారు. ఇంతకుముందు కూడా మయాన్ క్యాలెండర్ ప్రకారం 2012లో ప్రపంచం ముగియనుందంటూ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జూన్ 21 ముగియడంతో 2012 మాదిరిగానే మాయాన్ క్యాలెండర్ అంతా అబద్ధమేనని మరోసారి రుజువైంది. (2012 కాదు, 2020లో యుగాంతం!) ఈ మాయాన్ క్యాలెండర్ అనేది 1582 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది. అయితే దీనికి ముందు తేదీలను కనుగొనడానికి వివిధ క్యాలెండర్లను ఉపయోగించాల్సి వచ్చిందని సిద్దాంతకర్తలు తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రజలు ఎక్కువగా మయాన్, జూలియన్ క్యాలెండర్లను అనుసంరించేవారని సమాచారం. ప్రస్తుతం ప్రపంచ దేశ ప్రజలు ఎక్కువగా గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తున్నారు. ఈ వింతైన సిద్ధాంతం ప్రకారం జూలియన్ క్యాలెండర్ మరో క్యాలెండర్‌కు మార్చబడుతున్న సమయంలో ఈ క్యాలెండర్ నుంచి సంవత్సరంలోని 11 రోజులు పోయాయాని నిపుణులు పేర్కొన్నారు. ఈ తర్వాత రోజులు ఆ రోజులు జతచేయబడ్డాయి. కానీ దీని ప్రకారం ప్రస్తుతం మనం 2020లో కాకుండా 2012లో ఉన్నామని నిపుణులు చెబుతున్నారు. (తూచ్.. యుగాంతం ఉత్తదే!) దీని గురించి పాలో తగలోగుయిన్ అనే శాస్త్రవేత్త ఈ సిద్దాంతాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ... ‘జూలియన్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం మనం సాంకేతికంగా 2012లో ఉన్నాము. గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి మారడం వల్ల సంవత్సరంలో కోల్పోయిన 11 రోజులను కొల్పోయాం. గ్రెగోరియన్ క్యాలెండర్ బట్టి (1752-2020) సార్లు 11 రోజులు = 2,948 రోజులు ఉపయోగించి 268 సంవత్సరాలు. 2,948 రోజులు / 365 రోజులు (సంవత్సరానికి) = 8 సంవత్సరాలు’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం మనం జూన్ 21, 2020 అనేది కి డిసెంబర్ 21, 2012 అవుతుంది. దీంతో కొంతమంది సిద్ధాంతకర్తలు 2012 డిసెంబర్ 21ని ప్రపంచ అంతంగా ప్రతిపాదించారు. . -
రేపు అతిపెద్ద పగటి రోజు
► 13 గంటల 7 నిమిషాల పాటు పగలు ► గుడివాడలో తొలి సూర్యోదయం నిజమే.. బుధవారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను మనం అనుభవించనున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్న జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే. సాధారణంగా మనం ప్రతిరోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది.. జూన్ 21వ తేదీ బుధవారం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది. చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది. ఏటా జూన్ 20 లేదా 21వ తేదీన లేదా డిసెంబర్లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం. మన రాష్ట్రంలో గుడివాడ ఈ నెల 21వ తేదీ మనదేశంలోని మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది. మన రాష్ట్రంలో తొలి సూర్యోదయం కృష్ణాజిల్లాలోని గుడివాడలో సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. ఇలాంటి పరిణామం 1975లో వచ్చిందని, తిరిగి మళ్లీ 2203వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. – పటమట (విజయవాడ తూర్పు) -
అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లు
ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ మరోసారి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లకు తెర తీసింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఆధారిత డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటినుంచి జూన్ 21 వరకు సాగే మూడు రోజుల ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మోటోరోలా, వన్‌ప్లస్, ఆపిల్, శాంసంగ్ తదితర బ్రాండ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. అంతేకాదు ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్ లాంటి ఇతర ఉపకరణాలపై ఆఫర్లు , డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్ వెల్లడించింది. ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3 టీ , జీ5 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, కూల్‌పాడ్ నోట్ 5 లైట్ తదితర స్మార్ట్ఫోన్లపై ఈ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 7 32జీబీ, 128జీబీ, 256జీబీ ఫోన్లు రాయితీ ధరల్లో వరుసగా రూ. 42,999, రూ. 54,490,రూ. 65,900 లో లభ్యం. అలాగే రూ. 13,060 పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఐఫోన్ 6 32జీబీ రూ. 24,999కే లభించనుది. దీనికి కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వన్ ప్లస్ 3టీపై డిస్కౌంట్ తోపాటు వొడాఫోన్ 45 జీబీ డేటా అయిదు నెలలు ఉచితం. మోటో జెడ్ ను రూ.29వేలకే అందిస్తోంది. రూ. 13వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ , శాంసంగ్ గెలాక్సీ 7 ప్రో రూ.8690కు అందుబాటులో ఉంచింది. రూ. 6,712 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూల్ ప్యాడ్ పై రూ. 2వేలు డిస్కౌంట్ అందిస్తోంది. వీటితోపాటు ఆపిల్, హెచ్‌పీ, లెనోవా, డెల్ తదితర బ్రాండ్లు ల్యాప్ ట్యాప్ ధరలను కూడా భారీగా తగ్గించింది. దాదాపు రూ.10 వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేనా..ఈ మూడు రోజుల అమ్మకాల్లో టీవీ, ఫ్రిజ్ ఇతర పెద్ద గృహోపకరణాలపై డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. -
ఈరోజు ట్విట్టర్ చూశారా..!
చీమచిటుక్కుమన్నా టపీమని చెప్పే అత్యంత వేగవంతమైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్. ఆ ట్విట్టర్ నేడు ప్రపంచంతో కలిసి యోగాసనం వేసింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం కావడంతో ప్రముఖ సామాజిక అనుసంధాన వేధిక ట్విట్టర్ యోగా రంగును పులుముకుంది. వందల సంఖ్యలో యోగా ట్వీట్లతో నిండిపోయింది. మరే, సామాజిక అనుసంధాన వేదికలో కనిపించనన్ని యోగాకు సంబంధించిన వార్తలను కళ్లముందుకు తీసుకొచ్చింది. ఒక్క భారత దేశంలో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలనే కాదు.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలను తనతో మోసుకొచ్చి తన అభిమానులకు వండివారుస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో యోగా ఫొటోలు.. వీడియోలు, కథనాలు ట్విట్టర్లో దర్శనం ఇస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ట్విట్టర్ కాస్తంతా ఎక్కువ మొత్తంగానే యోగా అంశాలను అందించగలుగుతుందని చెప్పాలి. భారత దేశ ప్రధాని నరంద్రమోదీ నుంచి వివిధ ప్రపంచ దేశాల నేతల, సెలబ్రిటీల, సామాన్యుల, విద్యార్థులు ఒక్కరని కాదు దాదాపు అన్ని రకాల వ్యక్తుల యోగాసనాలను అభిప్రాయాలను ట్విట్టర్ మోసుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ట్విట్టర్లోకి అడుగుపెట్టిన వాళ్లకు మాత్రం 'వావ్.. యోగా లోకం ఇంత పెద్దదా' అని అనిపించకమాత్రం మానదు. -
21న సంజీవయ్య పార్కులో 'యోగా డే'
కాచిగూడ (హైదరాబాద్) : స్థానిక సంజీవయ్య పార్కులో ఈ నెల 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకట్‌రెడ్డి తెలిపారు. బర్కత్‌పురలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, వాకర్స్, వివిధ యోగా కేంద్రాల నుంచి యోగా దివస్‌లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జయప్రకాష్ నడ్డ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న యోగా దినం పాటించనున్న విషయం విదితమే.


