అమెజాన్‌ మరోసారి భారీ ఆఫర్లు | Amazon Sale Offers Deals on iPhone 7, OnePlus 3T, iPhone 6, and More | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ మరోసారి భారీ ఆఫర్లు

Jun 19 2017 1:38 PM | Updated on Sep 5 2017 1:59 PM

అమెజాన్‌ మరోసారి భారీ ఆఫర్లు

అమెజాన్‌ మరోసారి భారీ ఆఫర్లు

ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్ మరోసారి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లకు తెర తీసింది.

ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్ మరోసారి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లకు తెర తీసింది.   స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఆధారిత డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు, ఆఫ‌ర్లతో వినియోగ‌దారుల‌ను  ఆక‌ట్టుకుంటోంది. నేటినుంచి  జూన్‌ 21 వరకు సాగే మూడు రోజుల ధరలను  ప్రకటించింది. ముఖ్యంగా  మోటోరోలా, వన్‌ప్లస్‌, ఆపిల్‌, శాంసంగ్‌ తదితర బ్రాండ్లపై  భారీ తగ్గింపును ప్రకటించింది.   అంతేకాదు ల్యాప్‌టాప్‌, హెడ్‌ఫోన్ లాంటి ఇతర ఉపకరణాలపై   ఆఫర్లు ,  డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్‌ వెల్లడించింది. 

ఐఫోన్ 7, వన్‌ప్లస్‌ 3 టీ , జీ5  ప్లస్, ఐఫోన్‌ ఎస్‌ఈ, కూల్‌పాడ్ నోట్ 5 లైట్  తదితర స్మార్ట్‌ఫోన్లపై ఈ  తగ్గింపు ధరలను  ఆఫర్‌  చేస్తోంది.  ఐఫోన్ 7 32జీబీ, 128జీబీ,  256జీబీ ఫోన్లు  రాయితీ ధరల్లో వరుసగా రూ. 42,999, రూ. 54,490,రూ.  65,900 లో లభ్యం. అలాగే  రూ. 13,060 పాత స్మార్ట్ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌   ఐఫోన్ 6 32జీబీ  రూ. 24,999కే లభించనుది. దీనికి కూడా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్  వర్తిస్తుంది.  

వన్‌ ప్లస్‌ 3టీపై  డిస్కౌంట్‌ తోపాటు వొడాఫోన్‌ 45 జీబీ డేటా అయిదు నెలలు ఉచితం.  మోటో జెడ్‌ ను రూ.29వేలకే అందిస్తోంది. రూ. 13వేల దాకా  ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ , శాంసంగ్‌ గెలాక్సీ 7 ప్రో రూ.8690కు  అందుబాటులో ఉంచింది.  రూ. 6,712 దాకా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌  కూల్‌ ప్యాడ్‌ పై రూ. 2వేలు డిస్కౌంట్‌ అందిస్తోంది.

వీటితోపాటు ఆపిల్, హెచ్‌పీ,  లెనోవా, డెల్ తదితర బ్రాండ్లు ల్యాప్‌ ట్యాప్‌ ధరలను కూడా భారీగా తగ్గించింది.   దాదాపు రూ.10 వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా అందిస్తోంది. అంతేనా..ఈ మూడు రోజుల అమ్మకాల్లో  టీవీ, ఫ్రిజ్‌ ఇతర  పెద్ద గృహోపకరణాలపై డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలకు అమెజాన్‌ అధికారిక  వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement