breaking news
sale offers
-
అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లు
ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ మరోసారి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లకు తెర తీసింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఆధారిత డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటినుంచి జూన్ 21 వరకు సాగే మూడు రోజుల ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మోటోరోలా, వన్‌ప్లస్, ఆపిల్, శాంసంగ్ తదితర బ్రాండ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. అంతేకాదు ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్ లాంటి ఇతర ఉపకరణాలపై ఆఫర్లు , డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్ వెల్లడించింది. ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3 టీ , జీ5 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, కూల్‌పాడ్ నోట్ 5 లైట్ తదితర స్మార్ట్ఫోన్లపై ఈ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 7 32జీబీ, 128జీబీ, 256జీబీ ఫోన్లు రాయితీ ధరల్లో వరుసగా రూ. 42,999, రూ. 54,490,రూ. 65,900 లో లభ్యం. అలాగే రూ. 13,060 పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఐఫోన్ 6 32జీబీ రూ. 24,999కే లభించనుది. దీనికి కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వన్ ప్లస్ 3టీపై డిస్కౌంట్ తోపాటు వొడాఫోన్ 45 జీబీ డేటా అయిదు నెలలు ఉచితం. మోటో జెడ్ ను రూ.29వేలకే అందిస్తోంది. రూ. 13వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ , శాంసంగ్ గెలాక్సీ 7 ప్రో రూ.8690కు అందుబాటులో ఉంచింది. రూ. 6,712 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూల్ ప్యాడ్ పై రూ. 2వేలు డిస్కౌంట్ అందిస్తోంది. వీటితోపాటు ఆపిల్, హెచ్‌పీ, లెనోవా, డెల్ తదితర బ్రాండ్లు ల్యాప్ ట్యాప్ ధరలను కూడా భారీగా తగ్గించింది. దాదాపు రూ.10 వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేనా..ఈ మూడు రోజుల అమ్మకాల్లో టీవీ, ఫ్రిజ్ ఇతర పెద్ద గృహోపకరణాలపై డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. -
భారీ డిస్కౌంట్లతో మరోసారి ఫ్లిప్ కార్ట్ సేల్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. నేటి నుంచి(జూన్ 10) డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తోంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు షాప్ క్లూస్ కూడా సేల్ ఆఫర్స్ ను ప్రారంభించింది. ఫ్యాషన్ ఉత్పత్తులపై 9-డే ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ ప్రారంభిస్తుండగా... షాప్ క్లూస్, హోమ్ కిచెన్, ఎలక్ట్రిక్ యాక్ససరీస్, ఫ్యాషన్, సంబంధిత యాక్ససరీస్ పై వారం పాటు సేల్ ఆఫర్లు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల కొద్ది ఫ్యాషన్ లవర్స్ కోసం ఈ ఎక్స్ క్లూజివ్ సేల్ ను నిర్వహిస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ హెడ్ రిషి వాసుదేవ్ తెలిపారు. జూన్ 10 నుంచి మొదలై, తొమ్మిది రోజుల పాటు అంటే జూన్ 18 వరకు ఈ సేల్ నిర్వహిస్తామని చెప్పారు. దీనిలో 50 బ్రాండ్స్ పై 50-80 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ను కంపెనీ అందించనుంది. ఈ తొమ్మిది రోజుల విక్రయంలో భాగంగా ''ఏ 'బిడ్ అండ్ విన్' కంటెక్ట్స్ ను కూడా కస్టమర్లకు ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. ఈ కంటెక్ట్స్ లో 13,995 రూపాయల విలువైన ఎంపోరియో అర్మానీ వాచ్ ను, 15,960 రూపాయల విలువైన విక్టోరినాక్స్ బ్యాగ్ ను అందించనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అదేవిధంగా షాప్ క్లూస్ నిర్వహిస్తున్న సేల్ పై కూడా ఆ కంపెనీ భారీ ఆశలే పెట్టుకుంది. గత నెలలో నిర్వహించిన సేల్ కంటే రెండింతలు లావాదేవీలను పెంచుకోవాలని షాప్ క్లూస్ చూస్తోంది.