ఈడీ విచారణ: సోనియా గాంధీని కలుసుకున్న రాహుల్‌ | National Herald ED Questions: Rahul Gandhi Met Sonia Gandhi | Sakshi
Sakshi News home page

ఈడీ విచారణ మధ్యలోనే సోనియా గాంధీని కలిసిన రాహుల్‌

Jun 13 2022 4:16 PM | Updated on Jun 13 2022 4:20 PM

National Herald ED Questions: Rahul Gandhi Met Sonia Gandhi - Sakshi

సోదరి ప్రియాంకతో రాహుల్‌ గాంధీ

ఈడీ విచారణ ‍ గ్యాప్‌లోనే.. రాహుల్‌ గాంధీ తన తల్లి సోనియా గాంధీని కలుసుకున్నారు.

న్యూఢిల్లీ: ఈడీ విచారణ మధ్యలోనే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(51), తన తల్లి సోనియా గాంధీని కలుసుకున్నారు. కొవిడ్‌ బారిన పడ్డ సోనియా గాంధీ ప్రస్తుతం గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ తరుణంలో సోమవారం ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనే.. మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు ఈడీ అధికారులు. దీంతో ఇంటికి వెళ్లి భోజనం చేసి.. ఆపై సోదరి ప్రియాంకతో కలిసి  రాహుల్‌ గాంధీ, గంగారాం ఆస్పత్రికి వెళ్లారు. సోనియాను వాళ్లు పరామర్శించినట్లు తెలుస్తోంది. ఇక లంచ్‌ బ్రేక్‌ తర్వాత రాహుల్‌ గాంధీ, తిరిగి ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం రెండో విడత విచారణ కొనసాగుతోంది.

చదవండి: సోనియా ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement