ED Summons To Sonia Gandhi: సోనియాకు మరోసారి సమన్లు జారీ చేసిన ఈడీ

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ(75)కి మరోసారి సమన్లు జారీ చేసింది. కోవిడ్ బారిన పడిన ఆమె ఈనెల 8వ తేదీ నాటి విచారణకు హాజరుకాలేకపోయారు. దీంతో, ఈ నెల 23వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఈనెల 13వ తేదీన రాహుల్ గాంధీ హాజరు కావాల్సి ఉంది.
చదవండి: (Presidential Polls: ‘రాష్ట్రపతి’ బరిలో ఉమ్మడి అభ్యర్థి!)